Allu Arjun : పుష్ప 2 పై అన్నీ అబద్ధాలేనా..?

ఐకన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ), సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతోన్న పుష్ప 2 మూవీ గురించి రకరకాల వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ఈ సినిమా విషయంలో దర్శకుడు, హీరోకు మధ్య క్రియేటివ్ వర్క్ డిఫరెన్సెస్ వచ్చాయని, నిర్మాతలతోనూ హీరోకు ప్రాబ్లమ్స్ వచ్చాయని.. అల్లు అర్జున్ రెడీగా ఉన్నా సుకుమార్ షూటింగ్ చేయడం లేదనీ.. అందుకే అతను అలిగి గడ్డం తీసేశాడనీ.. కాబట్టి పుష్ప 2 ఈ 2024లో రిలీజ్ కాదు అనీ.. ఇలా రకరకాల రూమర్స్ హల్చల్ చేశాయి. బట్ అవన్నీ అబద్ధాలేనట. ఇప్పటి వరకూ మూవీ టీమ్ నుంచి అలాంటివేం జరగలేదని టాక్. టాక్ కాదు నిజం అంటున్నారు.
నిజానికి ఓ కొత్త షెడ్యూల్ లో కనిపించే గెటప్ కోసం అల్లు అర్జున్ గెడ్డం తగ్గించాడట. అలాగే సుకుమార్ కూడా తన కూతురు హయ్యొర్ ఎడ్యుకేషన్ కోసం విదేశాలకు వెళ్లడం కారణంగా కాస్త ఆలస్యం అయిందట. అయినా తనతో పాటు లిరిసిస్ట్ చంద్రబోస్ ను కూడా తీసుకువెళ్లి అక్కడా పాటలకు సంబంధించిన పనులు చేశాడనీ.. అలాగే ఇప్పటి వరకూ అయిన ప్రొడక్షన్ ను ఎడిటింగ్ చేయిస్తున్నాడట. అందువల్లే షూటింగ్ కు కాస్త గ్యాప్ వచ్చింది తప్ప.. ఇప్పటి వరకూ కొన్ని వెబ్ సైట్స్ పనిగట్టుకుని రాసినట్టు ఎవరి మధ్యా ఎలాంటి గ్యాప్ లేదనీ.. అలాగే రిలీజ్ డేట్ లో మార్పూ లేదని ఖచ్చితమైన సమాచారం వచ్చింది.
ఇక కొత్త షెడ్యూల్ ఈ నెల 25 నుంచి స్టార్ట్ అవుతుందట. అల్లు అర్జున్ 28 నుంచి సెట్స్ లో జాయిన్ అవుతాడట. ఇప్పటి వరకూ అంతా సజావుగానే ఉంది. ఆ మధ్య విడుదల చేసిన సూసేకీ అగ్గిరవ్వ మాదిరే అనే పాట ఓ రేంజ్ లో వైరల్ అయింది. అలాంటి మరో వైబ్రంట్ సాంగ్ కూడా త్వరలోనే విడుదల చేస్తారట. అదీ మేటర్. సో.. ఇప్పటి వరకూ పుష్ప 2 గురించి వచ్చిన వార్తలన్నీ అబద్ధాలు అండ్ జస్ట్ రూమర్స్ మాత్రమే అన్నమాట.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com