Dil Raju : బిజీ బిజీగా తెలుగు సినిమా నిర్మాతలు

Dil Raju :   బిజీ బిజీగా తెలుగు సినిమా నిర్మాతలు
X

గత కొన్ని రోజులుగా తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వేతనాలు పెంపు కోసం సాగుతున్న నిరసన తీవ్ర స్థాయికి చేరింది. నాలుగైదు రోజులుగా సినిమా షూటింగ్ లు పూర్తిగా ఆగిపోయాయి. భారీ బడ్జెట్ చిత్రాల నుంచి మినీ బడ్జెట్ మూవీస్ వరకూ ఏ షూటింగ్ సాగడం లేదు. మరోవైపు ఈ ఇష్యూను క్లియర్ చేసుకునేందుకు అటు ఫెడరేషన్ సభ్యులు, ఇటు నిర్మాతలు అదే పనిగా మీటింగ్ ల మీద మీటింగ్ లు, చర్చలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న నిర్మాతలంతా ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ ను కలిసి సమావేశం అయ్యారు. ఇవాళ (సోమవారం) మధ్యాహ్నం నుంచి ఆయనతో చర్చలు సాగిస్తున్నారు. దుర్గేష్ తో చర్చిస్తోన్న టీమ్ లో 1.బి వి ఎస్ ఎన్ ప్రసాద్

2.డి వి వి దానయ్య

3.కె ఎల్ నారాయణ

4.భరత్ ( ఛాంబర్ ప్రెసిడెంట్)

5.నాగ వంశీ

6.వై.రవిశంకర్

7.విశ్వ ప్రసాద్

8.బన్నీ వాసు

9.వంశీ ( uv creations)

10.చెర్రీ (Mythri Movies)

11.వివేక్ కూచిభొట్ల

12.సాహు గారపాటి వంటి నిర్మాతలు ఉన్నారు.

మరోవైపు ఇదే రోజు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రితో సైతం భేటీలు సాగుతున్నాయి. ఇక్కడ ఎఫ్.డి.సి ఛైర్మన్ దిల్ రాజు తో పాటు ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ నిర్మాతలు యార్లగడ్డ సుప్రియ, భోగవల్లి బాపినీడు తదితరులు మంత్రితో చర్చలు సాగిస్తున్నారు.

ఇలాంటి విషయాల్లో పట్టు విడుపులు ఉండాలి. కానీ రెండు వైపులా గట్టిగా పట్టుబట్టే ఉన్నారు. ఒకవేళ నిర్మాతలు దిగినా.. మరికొన్ని కండీషన్స్ పెడుతున్నారు. అటు వాళ్లు ఓకే అనుకున్నా.. ఆ కండీషన్స్ ను వ్యతిరేకిస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న ప్రొడ్యూసర్స్ అంతా క్షణం తీరిక లేకుండా వీలైనంత త్వరగా ఈ విషయాన్ని ఓ కొలిక్కి తీసుకు వచ్చి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రెండు రోజుల్లో వ్యవహారం ఓ కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయి.

Tags

Next Story