Lucky Baskar, KA : మూడు సినిమాలూ స్ట్రాంగ్ గానే ఉన్నాయ్

చాలా రోజుల తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. వచ్చిన సినిమాల్లో ఒక్కటి తప్ప అన్నీ హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. ఈ దీపావళి సందర్భంగా విడుదలైన లక్కీ భాస్కర్, క, అమరన్, బఘీరా చిత్రాల్లో బఘీరాకు మాత్రం రొటీన్ అన్న టాక్ వచ్చింది. మిగతా మూడూ భిన్నమైన జానర్స్ తో రావడం.. మూడింటికీ పాజిటివ్ టాక్ వస్తుండటంతో పాటు బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేస్తున్నాయి. మూడు సినిమాలూ కమర్షియల్ గా ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంటున్నాయి. ఈ సినిమాలకు సంబంధించి కొన్నవాళ్లెవరూ నష్టపోరు అనే గ్యారెంటీ స్పష్టంగా కనిపిస్తోంది. పైగా మూడు రోజులుగా మగ్జిమం థియేటర్స్ లో హౌస్ ఫుల్ బోర్డ్ కనిపిస్తోంది.
లక్కీ భాస్కర్ బ్యాంకింగ్, షేర్ మార్కెట్స్ లో జరిగే స్కామ్స్ ను సింపుల్ గా చెబుతూ ఆకట్టుకుంది. బలమైన కథనం, డైలాగ్స్ ఈ చిత్రానికి ఎసెట్స్ గా నిలిచాయి. వెంకీ అట్లూరి రచనకు చాలామంది ఫిదా అయ్యారు. దుల్కర్,మీనాక్షి ది బెస్ట్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు. అందుకే ఈ మూవీకి యూనానిమస్ గా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేసింది. అటు ఓవర్శీస్ లో సైతం ఆకట్టుకుంటంది.
క్లిష్ట కాలంలో ఉన్న కిరణ్ అబ్బవరం ఓ రేంజ్ కాన్ఫిడెన్స్ తో హిట్ కొట్టకపోతే ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతా అన్నాడు. అతనెందుకు అంత ఓపెన్ ఛాలెంజ్ చేశాడో క చూసిన వాళ్లందరికీ అర్థం అవుతోంది. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే తో అద్భుతమైన థ్రిల్లర్ అనిపించుకుందీ మూవీ. సుజిత్, సందీప్ ద్వయం డైరెక్ట్ చేసి క కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే ది బెస్ట్ గా నిలవబోతోందని బాక్సాఫీస్ లెక్కలు చెబుతున్నాయి.
ఇక తమిళ్ డబ్బింగ్ మూవీగా వచ్చిన అమరన్ మినిమం ప్రమోషన్స్ తోనే ఫస్ట్ డే డీసెంట్ కలెక్షన్స్ వసూలు చేసింది. మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా వచ్చిన ఈ చిత్రానికి తెలుగులో సాయి పల్లవి పెద్ద ఎసెట్ అయింది. ఈ రెండు రోజుల్లో అమరన్ కూడా సేఫ్ అయిపోయే అవకాశాలున్నాయి.
కన్నడ నుంచి వచ్చిన బఘీరాపై అంచనాలు లేవు. హీరో తెలుగు వారికి అస్సలు తెలియదు. ప్రశాంత్ నీల్ కథ అందించాడు అన్నారు కానీ.. అది కిచిడి కథ. ఇప్పటికే అనేక మాస్ ఎంటర్టైనర్స్ లో చూసిన పాయింటే ఇది. ఈ కారణంగా బఘీరాను తెలుగులో పెద్దగా పట్టించుకోవడం లేదు.
ఏదేమైనా ఒక వారం విడుదలైన మూవీస్ లో మూడు సినిమాలు బ్లాక్ బస్టర్, సూపర్ హిట్, హిట్ టాక్ తెచ్చుకోవడం ఈ మధ్య కాలంలో ఇదే అని చెప్పాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com