Thalapathi Re-Release : రజినీకాంత్, మమ్ముట్టిల క్లాసిక్ దళపతి రీ రిలీజ్

కొన్ని సినిమాలు ఎప్పుడు చూసినా.. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టవు. ఇలాంటి వాటినే క్లాసిక్స్ అంటాం. ఆ క్లాసిక్స్ లో మాగ్జిమం క్లాస్ మూవీసే ఉంటాయి. బట్ చాలా అరుదుగా మాస్ మూవీస్ కు కల్ట్ క్లాసిక్ అనే పేరొస్తుంది. అలాంటి మూవీస్ లో మొదటి వరసలో ఉండే సినిమా ‘దళపతి’. రజినీకాంత్, మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో మణిరత్నం క్రియేట్ చేసిన ఈ విజువల్ వండర్ కు ఇప్పటికీ తిరుగులేని ఫ్యాన్ బేస్ ఉంది. పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, ఇళయరాజా సంగీతం.. అబ్బో అసలీ సినిమా చూడ్డమే ఓ అందమైన అనుభవం అన్నట్టుగా ఉంటుంది. ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందినట్టు కనిపించినా.. మహా భారతాన్ని ఇంత గొప్పగా సోషలైజ్ చేసిన సినిమా మరోటి కనిపించదు.
భారతంలోని కర్ణ, దుర్యోధనుల పాత్రలను రిఫరెన్స్ గా తీసుకుని, సీతారాముల పాత్రలుగా శోభన, అరవింద్ స్వామిలను, కుంతి పాత్రలో శ్రీ విద్య నటించిన ఆ సినిమా చాలామందికి ఓ బెస్ట్ మెమరీ. ఆ జ్ఞాపకం ఎన్నిసార్లు తలచుకున్నా అదే అనుభూతిని ఇవ్వడం ఈ మూవీ గొప్పదనం. ఓ రకంగా అప్పటి వరకూ కమర్షియల్ మాస్ హీరోగా ఫంకీ వేషాలతో కనిపించిన రజినీకాంత్ లోని బెస్ట్ యాక్టర్ ను ఎలివేట్ చేశాడు మణిరత్నం.
ఈ మధ్య రీ రిలీజ్ ల ట్రెండ్ ఈ చిత్రాన్ని బెస్ట్ క్వాలిటీకి మార్చి మళ్లీ విడుదల చేస్తే బావుండు అని చాలామంది అనుకున్నారు. అందరి మాటలూ తెలిశాయేమో.. ఈ సారి రజినీకాంత్ బర్త్ డే సందర్భంగా దళపతిని మళ్లీ విడుదల చేస్తున్నారు. అయితే ఇది కేవలం తమిళ్ ప్రేక్షకులకు మాత్రమే. తెలుగులో ఇంకా రిలీజ్ చేయడం లేదు. బట్ ఇక్కడ కూడా దళపతి తమిళ్ కు మించిన అభిమానులున్నారు. వారి కోసం తెలుగులోనూ రీ రిలీజ్ చేస్తే బావుంటుందేమో కదా.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com