Allari Naresh Alcohol : అల్లరి నరేష్ ఆల్కహాల్ టీజర్ ఎలా ఉంది..?

కామెడీ సినిమాలకు కాలం చెల్లిందనుకున్నాడేమో కొన్నాళ్లుగా అల్లరి నరేష్ సీరియస్ సినిమాలతో వస్తున్నాడు. అంతకు ముందు అతను చేసిన కొన్ని కామెడీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి. రూట్ మార్చడానికి అదీ ఓ కారణం. అయితే కొన్నాళ్లుగా ప్రయోగాలు కూడా చేస్తున్నాడు. ఆ మధ్య వచ్చిన బచ్చల మల్లి అనే మూవీ అలాంటిదే. బట్ అదీ పోయింది. ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి వెరైటీగా ‘ఆల్కహాల్’ అనే టైటిల్ పెట్టారు. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలైంది.
ఆల్కహాల్ అనే టైటిల్ చూడగానే ఎవరైనా హీరో పెద్ద తాగుబోతు అనుకుంటారు. కానీ అందుకు భిన్నంగా ఉంది టీజర్. అతనికి అస్సలు మందు అంటే ఇష్టం ఉండదు. లక్షలు లక్షలు సంపాదించినా మందు తాగని పాత్రలో నరేష్ కనిపించబోతున్నాడు. అతన్ని మందు తాగమని బలవంతం చేస్తూ సత్య పాత్ర కనిపిస్తుంది. కట్ చేస్తే అదే సత్య చేత మందు మాన్పించడమే కాదు.. తన ఫ్రెండ్స్ ను కొందరిని పిలిచి వారితో మందు ‘తాగించమని’బలవంతం చేస్తాడు. వాళ్లు తాగము అంటారు. వాళ్లు తాగకపోతే సత్యను కొడుతుంటాడు నరేష్. అయితే ఆ నలుగురు ఫ్రెండ్స్ కోణంలో మరో కథ కూడా ఉండేలా ఉంది. అలాగే సత్య పాత్ర కూడా కీలకంగా కనిపిస్తోంది. మరి ఈ ఆల్కహాల్ డోస్ ఎవరికి ఎక్కువ అవుతుంది.. ఎవరికి సమస్య అవుతుంది అనేది సినిమాలో చూడాలి.
టీజర్ లో నువ్వు మందు ఎందుకు తాగవు అని అంతా కలిసి నరేష్ ను అడిగితే అతను.. ‘తాగితే మనమీద మనకు కంట్రోల్ ఉండదు సార్. నన్ను ఆల్కహాల్ కంట్రోల్ చేయడం నాకు ఇష్టం ఉండదు.. ’అని చెప్పే డైలాగ్ బావుంది.
ఇక ఈ చిత్రంలో నరేష్ సరసన నిహారిక ఎన్.ఎమ్ నటిస్తోంది. ఇతర పాత్రల్లో హర్షవర్ధన్, రుహాని శర్మ, గిరీష్ కులకర్ణి, చైతన్య కృష్ణ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించబోతున్నారు. మెహర్ తేజ్ దర్శకత్వం చేస్తున్నాడు. విశేషం ఏంటంటే.. ఈ మూవీని అంతా బాగా తాగేసి తెగ ప్రామిస్ లు చేసుకుని ఆ తర్వాత రోజును రొటీన్ గా మొదలుపెట్టే.. ‘జనవరి 1న’ విడుదల చేయబోతున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com