Allari Naresh : ఈ సారి ఆత్మలతో వస్తోన్న అల్లరి నరేష్

Allari Naresh :  ఈ సారి ఆత్మలతో వస్తోన్న అల్లరి నరేష్
X

అల్లరి నరేష్ కొత్త ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. కానీ హిట్లే రావడం లేదు. బట్ నటుడుగా మాత్రం ఎప్పుడూ డిజప్పాయింట్ చేయలేదు అతను. తన కామెడీ స్టార్ హీరో ఇమేజ్ కు తగ్గ కథలు రావడం లేదు. వచ్చినవేవీ పెద్దగా ఆకట్టుకోవడం లేదు. అందుకే సీరియస్ కథలకు నాంది పలికాడు. బాక్సాఫీస్ కు ఉగ్రం చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. రీసెంట్ గా వచ్చిన బచ్చలమల్లి గురించి చాలామంది చాలా చెప్పుకున్నారు. బట్ ఆ స్థాయిలో అది మెప్పించలేకపోయింది. దీంతో ఇప్పుడు ఆత్మలు అంటూ వస్తున్నాడు.

'12 ఏ రైల్వే కాలనీ" పేరుతో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని నాని కాసరగడ్డ డైరెక్ట్ చేస్తున్నాడు. ఎడిటింగ్ కూడా అతనే చేస్తున్నాడు. పొలిమేర 1,2 చిత్రాలతో ఆకట్టుకున్న డాక్టర్ విశ్వనాథ్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తూ షో రన్నర్ గా వ్యవహరిస్తున్నాడు.పొలిమేర ఫేమ్ కామాక్షి భాస్కర్ల ఫీమేల్ లీడ్ చేస్తోంది. తాజగా విడుదలైన ఈ మూవీ టీజర్ చూస్తే ప్రామిసింగ్ గానే అనిపిస్తోంది. ఆత్మలు, స్పిరిట్స్ కొందరికే ఎందుకు కనిపిస్తాయి అనే డైలాగ్ తో పాటు వచ్చిన సీన్స్ చూస్తే ఇది హారర్ మూవీస్ లో కొత్త కోణంలో కనిపించబోతోందేమో అనిపిస్తోంది. చాలా పాత్రలు ఉన్నాయి. టీజర్ లోనే భీమ్స్ సిసిరోలియో నేపథ్య సంగీతం హైలెట్ గా కనిపిస్తోంది. సాయి కుమార్ ఓ కీలక పాత్ర చేస్తు్న్నట్టున్నాడు. ఇక టీజర్ చివర్లో 'ప్రాణాలతో బయటకు పోవుడు అవసరం లేదన్నా ' అంటూ నరేష్ చెప్పిన డైలాగ్ చూస్తే ఇదంతా ఓ మేజ్ తరహా స్క్రీన్ ప్లే లా కనిపిస్తోంది. ఈ సమ్మర్ లోనే విడుదల అంటూ టీజర్ లో వేసిన ఈ చిత్రాన్ని శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నాడు. మొత్తంగా అల్లరి నరేష్ కు ఈ సారి ఆత్మలతో హిట్ పడేలానే ఉందంటున్నారు. మరి సినిమా వస్తే కానీ అసలు విషయం తెలియదు.

Tags

Next Story