Ram Charan : చరణ్ కు ఉన్న ఏకైక మేనమామను నేను

Ram Charan :  చరణ్ కు ఉన్న ఏకైక మేనమామను నేను
X

మెగా ఫ్యామిలీలో విభేదాలున్నాయా లేదా అనే డిబేట్స్ కొన్నాళ్లుగా అన్ని మీడియంలో వినిపిస్తున్నాయి. చాలామంది అదే పనిగా చర్చిస్తున్నారు. ఇలాంటి టైమ్ లో రెండు ఫ్యామిలీల హీరోల మధ్య బాక్సాఫీస్ వైరం ఉంటే ఫర్వాలేదు కానీ.. అది పర్సనల్ గా కూడా వెళ్లిన తర్వాత ఒకరి గురించి ఒకరు ఏం మాట్లాడినా అది మరో రకంగా ఆడియన్స్ లోకి లేదా ఫ్యాన్స్ లోకి వెళ్లే ప్రమాదం ఉంది. రీసెంట్ గా ఓ సినిమా ఫంక్షన్ లో అల్లు అరవింద్ కూడా అదే చేశాడు. ఇన్ డైరెక్ట్ గా చరణ్ ను తక్కువ చేస్తూ దిల్ రాజును పొగిడాడు అంటూ మెగా ఫ్యాన్స్ కొన్ని రోజులుగా అల్లు అరవింద్ ను ట్రోల్ చేస్తున్నారు. దానికి తాజాగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు సీనియర్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్.

'ఆ టైమ్ లో ఓ సీనియర్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పిన మాట అది. కేవలం దిల్ రాజు అప్ అండ్ డౌన్స్ ను ఒక్కవారం రోజుల్లోనే ఇన్ కమ్ ట్యాక్స్ ఇష్యూస్, సంక్రాంతికి వస్తున్నాం విజయం గురించి అతని కోసం చెప్పాను తప్ప.. చరణ్ ను ఉద్దేశించి కాదు. చరణ్ నా కొడుకు లాంటి వాడు. మా మధ్య ఎక్స్ ల్లెంట్ రిలేషన్ ఉంది. నాకున్న ఏకైక మేనల్లుడు, అతనికి ఉన్న ఏకైక మేనమామను నేను.. మధ్య ఎలాంటి ఇబ్బందీ లేదు. అయినా నా మాటల వల్ల మెగా ఫ్యాన్స్ ఇబ్బంది పడితే.. ఆ ఇబ్బంది పడిన వారికి సారీ చెబుతున్నాను" అన్నాడు.

నిజానికి అల్లు అరవింద్ గతంలో చెప్పినప్పుడు ఇన్ డైరెక్ట్ గా గేమ్ ఛేంజర్ పోయింది అన్నట్టే మాట్లాడాడు. అంటే చరణ్ కు ఫ్లాప్ వచ్చింది.. తన కొడుకు అల్లు అర్జున్ కు పుష్ప 2 రూపంలో బ్లాక్ బస్టర్ పడిందనే కదా అంటూ మెగా ఫ్యాన్స్ కాస్త హర్ట్ అయిన మాట వాస్తవం.తాజాగా తండేల్ తో మరో విజయం అందుకున్నాడు అల్లు అరవింద్. ఈ క్రమంలో సక్సెస్ మీట్ జరుగుతుంది. అందుకే ఓ మంచి తరుణంగా భావించాడేమో.. ఇలా సభా ముఖంగా సారీ చెప్పాడు. మరి ఈ సారీతో హర్ట్ అయిన మెగా ఫ్యాన్స్ సంతృప్తి చెందుతారా లేదా అనేది చూడాలి.

Tags

Next Story