Allu Aravind : బన్నీవాసుపై క్లారిటీ ఇచ్చిన అల్లు అరవింద్

సీనియర్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ అడగకుండానే ఓ క్లారిటీ ఇచ్చాడు. తాజాగా శ్రీ విష్ణు హీరోగా నటించిన సింగిల్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు వచ్చిన అతను అడగకుండానే ఇచ్చిన ఈ క్లారిటీ పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. ఇంతకీ విషయం ఏంటంటే.. కొన్ని రోజులుగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ కు కీలకంగా ఉంటూ.. ఆ బ్యానర్ లోనూ కొన్ని మంచి సినిమాలు రావడానికి కారణం అవుతున్న బన్నీ వాసు కనిపించడం లేదు. అతను గీతా ఆర్ట్స్ నుంచి తప్పుకున్నాడు.. లేదా తీసేశారు. అవసరానికి వాడుకుని వదిలేశారు.. అతని ప్లేస్ లో చిరంజీవి తోడల్లుడి కూతురు విద్యను తీసుకువచ్చారనీ ఇలా రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే తండేల్ మూవీ తర్వాత బన్నీ వాసు బయట కనిపించడం లేదు. ఆ మధ్య అల్లు అరవింద్ కూడా వరుసగా తను ఒక్కడే కొన్ని సినిమా ఫంక్షన్స్ కు వచ్చాడు. దీంతో ఇది నిజమే అనుకున్నారు చాలామంది. అయితే అది నిజం కాదనీ.. మళ్లీ మీడియా ప్రశ్నలతో ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకే ఎవరూ అడగకుండానే.. వేదికపై నుంచి క్లారిటీ ఇచ్చాడు అల్లు అరవింద్.
తనేమీ బన్నీ వాసును పక్కన పెట్టలేదు అని చెబుతూ.. అతన్నీ.. అతనితో పాటు విద్యను కూడా చెరో పక్కన నించో బెట్టి.. ఇద్దరూ తనకు రెండు కళ్లలాంటి వాళ్లు అని చెప్పాడు. విద్య .. అల్లు అరవింద్ కు మేన కోడలు అవుతుంది. ఇటు బన్నీ వాసుతో రక్త బంధం ఏం లేదు. అయితే బన్నీ వాసు మైక్ తీసుకుని ‘రెండు కళ్లలో పెద్ద కన్ను నేనే’అనడం.. ఆ వెంటనే ఆ కన్ను అప్పుడప్పుడూ కొడుతుంది అని అల్లు అరవింద్ అనడం చూస్తే పెద్దగా ఏం జరగలేదు కానీ.. ఏదో జరిగింది అనేది మాత్రం అర్థం అవుతోంది అంటున్నారు. ఏదేమైనా ఒక క్యాంప్ లో పర్మనెంట్ గా కనిపించే వ్యక్తి సడెన్ గా మాయం అయితే ఇలాంటి డౌట్స్ రావడం సహజం. సీనియర్ కాబట్టి మరిన్ని అనుమానాలు రాకముందే అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చేశాడు. కాకపోతే అది కాస్త తేడా ఉండటమే విశేషం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com