Allu Arjun Talk Show : పాన్ ఇండియా లెవల్లో అల్లు అర్జున్ టాక్ షో! తగ్గేదే లే!

Allu Arjun (tv5news.in)
Allu Arjun Talk Show : పుష్ప.. పుష్పరాజ్.. తగ్గేదేలే.. డ్యాన్స్ వేస్తే సూపరన్నారు. పుష్పలో యాక్టింగ్ చించేస్తే.. అదుర్స్ అని విజిలేశారు. అలవైకుంఠపురం స్టార్ ఇమేజ్ తీసుకువస్తే.. పుష్ప కాస్త పాన్ ఇండియా స్టార్ ని చేసేసింది. అదిగో ఆ గుర్తింపే ఓ రేంజ్ లో ఉంటే.. ఇప్పుడు దానికి డబుల్ డోస్ ఇవ్వడానికి ఓ స్పెషల్ షో తో రెడీ అవుతున్నాడు బన్నీ.
నా స్థానం మీ మనసు.. అంటూ బాలయ్య.. అన్ స్టాపబుల్ గా అదరగొడుతున్నాడు. దీంతో ఆహా ను అంతా ఓహో అంటున్నారు. ఇప్పుడు ఈ షో గ్రాండ్ ఫినాలే స్టేజ్ కు చేరుకుంది. అందుకే బన్నీతో ఓ సరికొత్త టాక్ షోకి ప్లాన్ చేశారు. అది అలా ఇలా ఉండదమ్మా.. ఓ రేంజ్ లో ఉంటుందమ్మా. సెలబ్రెటీలతో టాక్ షోలను అందరూ చేసేశారు. అందుకే అల్లు అర్జున్ కాస్త వెరైటీగా.. ఇంకో స్టెప్ వేశాడు.
టాలీవుడ్ సెలబ్రెటీలను టాక్ షోలలో చూసి చూసి ఆడియన్స్ బోర్ ఫీలవుతారనుకున్నారేమో.. ఇప్పుడు బన్నీ టాక్ షో సెట్టే మారిపోయింది. అదే షోకు అసెట్ గా ఉంటుందని తెలుస్తోంది. ఇందులో సెలబ్రెటీలతో పాటు ఇతర సినీ పరిశ్రమల ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్లు కూడా ఉంటారని టాక్. ఒకవేళ అదే జరిగితే.. ఈ షో కూడా పాన్ ఇండియా లెవల్ లో ఉండొచ్చు.
పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న బన్నీ.. ఈ టాక్ షోలో పాన్ ఇండియా స్టార్స్ తో ముచ్చట్లు చెప్పినా ఆశ్చర్యపోనక్కరలేదు. ఎంతైనా పుష్ప.. పుష్పరాజ్.. తగ్గేదే లే!
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com