నేనేదో సరదాగా అంటే లావణ్య మా వాడినే..: అల్లు అరవింద్
ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య నటించిన బేబీ సినిమా మరో రెండు రోజుల్లో థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. దీనికి ముఖ్య అతిధిగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ విచ్చేశారు. కార్యక్రమాన్ని హోస్ట్ చేసిన యాంకర్ సినిమాలోని హీరోయిన్ గురించి అల్లు అరవింద్ ని చెప్పమని అడగ్గా.. ఈ సినిమాని ఇన్స్పిరేషన్ గా తీసుకుని పెళ్లి చేసుకోవద్దు.
కెరీర్ లొ సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకోవాలని అన్నారు. తన బ్యానర్ లో మూడు సినిమాలు చేసిన ఓ హీరోయిన్ ని ఇక్కడే మంచి తెలుగు అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోమంటే ఆ అమ్మాయి మా వాడినే లవ్ చేసిందని వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ల గురించి చెప్పుకొచ్చారు. బేబీ సినిమా జులై 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తనకు కచ్చితంగా హిట్ ఇస్తుందని నమ్మకంగా చెబుతున్నాడు ఆనంద్ దేవరకొండ..
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com