Anu Emmanuel: శిరీష్‌తో డేటింగ్.. స్పందించిన అను..

Anu Emmanuel: అను ఇమ్మాన్యుయేల్ అందంగా ఉన్నా సినిమాల్లో అవకాశాలు అంతంత మాత్రమే.. ఓవర్ ఎక్స్‌పోజింగ్ చేసినా చేసిన సినిమాలు చాలా తక్కువ. ఇక అల్లు శిరీష్ కూడా ఏబీసీడీ తరువాత ఏ సినిమా చేయలేదు.
రాకేష్ శశి దర్శకత్వంలో వచ్చిన ఊర్వశివో రాక్షసివో చిత్రం ఈ రోజు థియేటర్లలో విడుదలై మంచి టాక్ అందుకుంటోంది. ముఖ్యంగా యూత్‌ని దృష్టిలో పెట్టుకుని తీసిన చిత్రంగా కనిపిస్తుంది ఈ సినిమా. పెళ్లి వద్దు.. సహజీవనం ముద్దు అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం రొమాన్స్, కామెడీ సమపాళ్లలో రంగరించారు.
సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. దాంతో నిజంగానే వీళ్లిద్దరూ డేట్ చేస్తున్నారనే ఆలోచనలు తలెత్తాయి చాలా మందిలో. మరి అల్లు అరవింద్‌కి రావడంలో కూడా ఆశ్చర్యం లేదు. దాంతో అదే విషయాన్ని అడిగేశారట అనుఇమ్మాన్యుయేల్‌ని.. శిరీష్‌తో డేట్ చేస్తున్నావా అని. ఆ తర్వాత చాలా సేపు దీని గురించి మాట్లాడి నవ్వుకున్నాం అంటూ చెప్పుకొచ్చింది అను.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com