Allu Arjun : అభిమానులకు కొండంత అండ అల్లూ అర్జున్

ఆపదలో ఉన్న అభిమానులకు ఆపన్న హస్తాన్ని అందిస్తున్నాడు టాలీవుడ్ హీరో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. తన యాక్టింగ్ తోనే కాకుండా ఇతరులకు సహాయం చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. ఆపదలో ఉన్న అభిమానికి తన సహాయాన్ని అందించి మంచి మనసును ప్రకటించాడు. ఇటీవల అల్లూ అర్జున్ అభిమాన సంఘం, వారి అభిమానులలో బాధలో ఉన్న ఒక అభిమానిని గుర్తించింది. సదరు అభిమాని తండ్రికి ఊపిరితిత్తుల వ్యాధి ఉందని, తొందరగా వైద్యం చేయించకపోతే ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలియడంతో ఈ విషయాన్ని అల్లూ అర్జున్ కు చేరవేశారు.
విషయం తెలుసుకున్న అల్లూ అర్జున్ సత్వరమే స్పందించి సహాయాన్ని అందజేశాడు. ఈ విషయాన్ని అల్లూ అర్జున్ ఫ్యాన్ గ్రూప్ సోషల్ మీడియాలో పంచుకుంది. "అభిమాని సమస్యను మా డెమీ గాడ్ స్పందించి అవసరమైన సహాయాన్ని అందజేశారు లవ్ యూ అన్నా" అని ట్వీట్ చేశారు. కష్టాలలో ఉన్న వ్యక్తులకు సహాయం చేయడం అల్లూ అర్జున్ ఎప్పుడూ ముందుంటాడు. ఇదివరకు కూడా పలువురు వ్యక్తులకు సహాయం చేశాడు అల్లూ అర్జున్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

