Allu Arjun: అల్లు అర్జున్‌, కల్యాణ్‌ రామ్‌‌లకు జరిమానా.. నిబంధనలను ఉల్లంఘించారంటూ..

Allu Arjun: అల్లు అర్జున్‌, కల్యాణ్‌ రామ్‌‌లకు జరిమానా.. నిబంధనలను ఉల్లంఘించారంటూ..
Allu Arjun: నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు.

Allu Arjun: నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కారుకు జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు జరిమానా విధించారు. శనివారం జూబ్లిహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 36 లోని నిరూస్‌ చౌరస్తాలో వాహనాల తనిఖీలు చేస్తున్న పోలీసులు.. అల్లు అర్జున్‌ కారును అడ్డుకున్నారు. ఆయన కారు అద్దాలకు ఉన్న బ్లాక్‌ ఫిలింను తొలగించి 7 వందల రూపాయల జరిమానా విధించారు. అదే దారిలో వచ్చిన హీరో కల్యాణ్‌ రామ్‌ కారుకు పోలీసులు అదే తరహాలో జరిమానా విధించారు. వై క్యాటగిరి భద్రత ఉన్న వ్యక్తులు మినహా ఇతరులెవరూ.. వాహనాలకు బ్లాక్‌ ఫిలిం ఉపయోగించరాదని.. ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశించింది.

Tags

Next Story