Allu Arha: అర్హకు అప్పుడే ఆరేళ్లు.. క్యూట్ బంగారానికి బర్త్‌డే విషెస్: అమ్మానాన్న

Allu Arha: తమ గారాల పట్టి అర్హ ఆరవ ఏట అడుగు పెట్టిన సందర్భంగా అమ్మానాన్న అల్లు అర్జున్, స్నేహలు పుట్టిన రోజు శుభాకాంక్షలు అందజేశారు. ఈరోజు నవంబర్ 21న తన ఆరవ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఇద్దరు సోషల్ మీడియా ద్వారా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
అల్లు అర్హ ఈరోజు నవంబర్ 21న తన ఆరవ పుట్టినరోజును జరుపుకుంది. అల్లు అర్జున్ అర్హాతో తన యానిమేటెడ్ సంభాషణల యొక్క అందమైన మాంటేజ్‌ను పోస్ట్ చేయడానికి సోషల్ మీడియాను వేదిక చేసుకున్నాడు.
గత రెండు సంవత్సరాలుగా, అల్లు అర్జున్, స్నేహ.. అర్హాకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అవి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ట్రెండ్ అవుతున్నాయి. బన్నీకి తన కుమార్తె అర్హా, కుమారుడు అల్లు అయాన్‌తో ఆడుకోవడం చాలా ఇష్టం. కుటుంబ సమేతంగా విహారయాత్రలకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు.
అల్లు అర్జున్ తన కుమార్తె వీడియోను ట్విట్టర్‌లో సోస్ట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
అల్లు అర్జున్, స్నేహల వివాహం మార్చి 6, 2011న జరిగింది. వారకి 2014లో అయాన్ పుట్టాడు. రెండేళ్ల తర్వాత అర్హ పుట్టింది. అల్లు వారి ఇంట ఆనందం వెల్లి విరిసింది.
Happy Birthday to the cuteness of my life . #alluarha #కందిరీగకథలు 😂 pic.twitter.com/83hQt0iKMn
— Allu Arjun (@alluarjun) November 21, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com