Allu Arjun : అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన పోలీస్ లు

Allu Arjun :  అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన పోలీస్ లు
X

ఐకన్ స్టార్ అల్లు అర్జున్ ను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీస్ లు అరెస్ట్ చేశారు. పుష్ప 2 విడుదల సందర్భంగా ఈ నెల 4న రాత్రి హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ కు ఫ్యామిలీతో కలిసి చూడ్డానికి వచ్చాడు అల్లు అర్జున్. ఆ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఈ కేస్ లో ఇప్పటికే థియేటర్ మేనేజర్ తో పాటు సెక్యూరిటీ మేనేజర్ ను కూడా అరెస్ట్ చేశారు పోలీస్ లు. ఈ ఘటనలో అల్లు అర్జున్ పై కూడా కేస్ నమోదైంది. అయితే తను రెగ్యులర్ గా తన సినిమా చూడ్డానికి థియేటర్ కు వెళుతుంటానని.. ఇది కూడా అలాంటిదే కాబట్టి ఆ ఘటనతో నాకు సంబంధం లేదనీ..తన అరెస్ట్ ను నిలిపివేయాలని కోరుతూ అల్లు అర్జున్ కోర్ట్ లో కేస్ వేశాడు. దీంతో పాటు ఆ ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత మృతి చెందిన మహిళ 25 లక్షల సాయం ప్రకటించాడు. ఇవన్నీ కలిపి అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయకపోవచ్చు అనుకున్నారు.

ప్రస్తుతం థ్యాంక్యూ ఇండియా అంటూ దేశవ్యాప్తంగా కొన్ని నగరాల్లో సక్సెస్ మీట్స్ నిర్వహిస్తోన్న అల్లు అర్జున్ ను ఇంట్లో ఉన్నాడు అని పక్కా సమాచారం మేరకు ఎలాంటి హడావిడీ లేకుండా టాస్క్ ఫోర్స్ పోలీస్ లు ఇంట్లోనే ఆయన్ని అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడి నుంచి నాంపల్లి సెషన్స్ కోర్ట్ లో హాజరుపరుస్తారు. ఈ కేస్ లో అల్లు అర్జున్ పై బిఎన్ఎస్ 105 సెక్షన్ లో కేస్ నమోదు చేశారు పోలీస్ లు.

నిజానికి ఈ ఘటనలో అల్లు అర్జున్ తప్పు లేదు అని చెప్పారు కానీ.. అతను పోలీస్ లకు సమాచారం ఇచ్చాను అని కూడా అన్నాడు. బట్.. ఆయన చాలా తక్కువ సమయంలోనే పోలీస్ లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇదీ కాక తను థియేటర్ కు వస్తున్నట్టు సోషల్ మీడియా అకౌంట్ లో ప్రకటించడంతో టికెట్స్ లేని వారు కూడా థియేటర్ కు వచ్చారు. మరి ఈ కేస్ లో ఇప్పటి అరెస్ట్ అయిన వారికి బెయిల్ రాలేదు. మరి అల్లు అర్జున్ కు ముందస్తు బెయిల్ వస్తుందా లేదా అనేది చూడాలి.

Tags

Next Story