Allu Arjun : అల్లు అర్జున్ వైల్డ్ లుక్ తో ‘రాక’

Allu Arjun :  అల్లు అర్జున్ వైల్డ్ లుక్ తో ‘రాక’
X

ఐకన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్ గా అతని కొత్త సినిమా నుంచి టైటిల్ విడుదల చేశారు. టైటిల్‘రాక’. రాక అనే టైటిల్ చాలా బావుంది. కథకు తగ్గట్టుగా ఉండేలా ఉంది. రాక అంటే ఎవరు అనే పాయింట్ లో ఉండబోతోంది అనిపించేలా ఉంది. అయితే ఈ టైటిల్ తో పాటు విడుదల చేసిన అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రం బైండ్ బ్లోయింగ్ అనేలా ఉంది. అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు. అసలు ఈ లుక్ ను అల్లు అర్జున్ ను ఎలా యాక్సెప్ట్ చేశాడు అని చాలామంది భావించారు. బట్ ఇది కూడా కథకు తగ్గట్టుగానే ఉండే లుక్ లా ఉంది. నెవర్ బిఫోర్ అనేలా ఉందీ లుక్. నిజానికి అల్లు అర్జున్ లాంటి టాప్ హీరో నుంచి ఇలాంటి లుక్ ను ఎవరూ ఊహించని కూడా ఊహించలేదు. అదే హైలెట్ గా నిలవబోతోంది.

అట్లీ డైరెక్షన్ లో రూపొందుతోన్న మూవీ ఇది. దీపికా పదుకోణ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇంకా ఇతర హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి తప్ప ఎవరూ కన్ఫార్మ్ కాదు. ఇప్పటికైతే ఇవన్నీ గాసిప్స్ గానే ఉండబోతున్నాయి. ఈ కథ కోసం 18యేళ్లుగా ఎదురుచూస్తున్నా అంటూ అట్లీ పెట్టిన పోస్ట్ మాత్రం వైరల్ గా మారింది. ఈ టైప్ కథ ఓ రేంజ్ లో ఉండబోతోంది అని కూడా చెప్పాడు. ఏదేమైనా అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్ గా విడుదల చేసిన ఈ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రం ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది. ఎక్స్ లోనే ఏకంగా ట్రెండింగ్ లో ఉంది.

Tags

Next Story