Allu Arjun : మరో సూపర్ హీరోగా అల్లు అర్జున్

ఐకన్ స్టార్ గా రోజు రోజుకూ మారుతున్నాడు అల్లు అర్జున్. డిఫరెంట్ కంటెంట్స్ తో మూవీస్ చేయాలని ఫిక్స్ అవుతున్నాడు. ప్రస్తుతం అట్లీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఇది ఇప్పటి వరకూ ఇండియాలో చేయలేనిది మూవీ అనిపించేలా ఉన్నాడు. దీపికా పదుకోణ్ ఫీమేల్ లీడ్ లో కనిపించబోతున్నాడు. ఈ చిత్రం కోసం హాలీవుడ్ రేంజ్ లో కష్టపడుతున్నాడు అల్లు అర్జున్. లుక్, కటౌట్, గెటప్ అన్నీ హాలీవుడ్ స్థాయిలో కనిపించబోతున్నాయి అనిపించాడు. ఈ మూవీ 2026 దసరాకు విడుదల చేయబోతున్నాడు అనే టాక్ ఉంది. అది చిత్రీకరణ మాత్రం 2026 ప్రారంభంలోనే అయిపోతుంది అనిపించాడు. అయితే నెక్ట్స్ ఏంటీ అనే ప్రశ్నకు కూడా అనేక సమాధానాలు వస్తున్నాయి. బట్ అతను ఓ మూవీకి సైన్ చేశాడు అనే వార్తలు నిజం వస్తున్నాయి. అది నిజమే అనేది తాజాగా తెలుస్తోంది.
అట్లీతో మాత్రమే సూపర్ హీరోగా కనిపించబోతున్నాడు అల్లు అర్జున్. అయితే అతని నెక్ట్స్ మూవీ కూడా అలాంటిదే అంటున్నారు. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు చెప్పలేదు కదా.. బసిల్ జోసెఫ్. యస్ బసిల్ జోసెఫ్ డైరెక్షన్ లోనే అల్లు అర్జున్ తర్వాతి సినిమా ఉండబోతోంది అనే వార్తలు ఆల్మోస్ట్ కన్ఫార్మ్ చేశారు. ఈ మూవీ కూడా ఓ సూపర్ హీరో తరహాలోనే ఉండబోతున్నాడు అనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ మాత్రం స్టార్ట్ చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. కాకపోతే అఫీషియల్ గా ఈ న్యూస్ ను ఇంకా చెప్పబోవడం లేదు అని మాత్రం తెలుస్తోంది.
మామూలుగా అయితే ముందుగా అల్లు అర్జున్ మాత్రం లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాడు అని చెబుతున్నారు.. కానీ అందులో నిజం లేదు. ఈ విషయంలో వాస్తవం లేదు అని సమాచారం. అలాగే త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేయబోయే మూవీ కూడా పూర్తిగా ఆపేశాడు అని టాక్ ఉంది. మొత్తంగా ఇప్పుడు పూర్తిగా అట్లీ దర్శకత్వంలో సినిమాపైనే ఎక్కువ ఫోకస్ చేయబోతుండటంతో పాటు బసిల్ జోసెఫ్ మూవీపైనా కాన్ సెట్రేట్ చేస్తున్నాడని టాక్.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

