Allu Arjun - Atlee : అల్లు అర్జున్ - అట్లీ మూవీ ఇప్పట్లో లేదా

ఐకన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత ప్లానింగ్స్ అన్నీ మార్చేశాడు. పుష్ప2 ప్యాన్ ఇండియా రేంజ్ లో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. బాహుబలి 2 స్థాయి వసూళ్లు సాధించి అల్లు అర్జున్ రేంజ్ ను దేశానికి చాటింది. పుష్ప2 తర్వాత అతను త్రివిక్రమ్ తో సినిమా చేయాల్సి ఉంది. ఇదో మైథలాజికల్ మూవీ అన్నారు. ఇప్పటి వరకూ ఎవరూ పెట్టనంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం ఉంటుందనే వార్తలు కూడా వచ్చాయి. కానీ ఐకన్ స్టార్ ప్లాన్ మార్చాడు. తమిళ్ దర్శకుడు అట్లీతో మూవీకి కమిట్ అయ్యాడు. దీంతో త్రివిక్రమ్ వెయిటింగ్ లిస్ట్ లోకి వెళ్లిపోయాడు. అయితే అతన్ని హోల్ట్ చేసినా అట్లీ మూవీ ఇప్పట్లో పట్టాలెక్కేలా లేదు అంటున్నారు.
అల్లు అర్జున్ - అట్లీ కాంబోలో హాలీవుడ్ రేంజ్ మూవీ రాబోతోందని ముందే హింట్ ఇచ్చారు కదా. ఇదో సూపర్ హీరో మూవీ అని కూడా చెబుతున్నారు. అవన్నీ ఎలా ఉన్నా.. టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ లో ఉండబోతోంది. టెక్నికల్ గానే కాదు.. మేకింగ్ పరంగానూ హాలీవుడ్ స్టైల్ ను ఫాలో అవుతున్నాడు అట్లీ. అదెలా అంటే.. హాలీవుడ్ మూవీస్ కు ప్రొడక్షన్ కంటే ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ కు ఎక్కువ టైమ్ తీసుకుంటారు. వీళ్లూ అదే చేయబోతున్నారు. సినిమాలో కళ్లు చెదిరే సీక్వెన్స్ లు చాలానే ఉంటాయట. వాటి కోసం విపరీతమైన విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ ను వాడుతున్నారు. అవి చిత్రీకరణ టైమ్ లో ఎలా ఉండాలో తెలియాలంటే వర్క్ షాప్ లు అవసరం. ఇందుకోసం ఏకంగా నాలుగైదు నెలలు కేటాయించబోతున్నారు.
క్లియర్ గా చెబితే అల్లు అర్జున్ - అట్లీ మూవీ నవంబర్ నుంచి కానీ పట్టాలెక్కదట. అప్పటి వరకూ ఐకన్ స్టార్ ఖాళీగా ఉండకుండా ఈ ప్రీ ప్రొడక్షన్ ఎలా జరుగుతుందో తెలుసుకోవడంతో పాటు వర్క్ షాప్ లో పార్టిసిపేట్ చేయబోతున్నాడు. మరోవైపు త్రివిక్రమ్ మైథలాజికల్ మూవీ స్టోరీ డిస్కషన్స్ కూడా ఉంటాయట. అదీ మేటర్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com