Allu Arjun : ఆ అమ్మాయికి ఆఫర్స్ ఇస్తా - అల్లు అర్జున్

టాలీవుడ్ బెస్ట్ డ్యాన్సర్స్ లిస్ట్ లో ఖచ్చితంగా ఉండే పేరు అల్లు అర్జున్. ఎలాంటి మూమెంట్ అయినా తనదైన శైలిలో స్టైలిష్ గా ప్రెజెంట్ చేస్తాడు. అందుకే అతన్ని స్టైలిష్ స్టార్ అన్నారు. తను చాలామంది కొత్త డ్యాన్సర్స్ ను కూడా పరిచయం చేశాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో కొరియోగ్రాఫర్ జానీ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఈ కేస్ చాలామంది అనుకున్నంత చిన్నది కాదు అని అర్థం అవుతోంది. ఆ అమ్మాయి మైనర్ గా ఉన్నప్పటి నుంచే జానీ లైంగిక దాడికి పాల్పడ్డాడు అని ఖచ్చితమైన ఆధారాలతో కేస్ నమోదైంది. ఈ విషయంలో జానీకి జైలు తప్పదు అనేది కూడా అర్థం చేసుకోవచ్చు. అయితే మొన్నటి వరకూ ఈ కేస్ లో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఇన్వాల్వ్ అయింది. ఆ టైమ్ లోనే జానీకి ఇండస్ట్రీ నుంచి కొందరు పెద్దల మద్ధతు ఉందని తెలిసిందట. దీంతో వీళ్లు పోలీస్ స్టేషన్ కు వెళ్లడమే బెటర్ అని ఆ అమ్మాయికి అండగా నిలిచి కేస్ కట్టే వరకూ నిలిచారు.
ఇక ఇప్పుడు ఆ అమ్మాయి( అదే పనిగా అమ్మాయి అంటారు పేరు చెప్పరెందుకు అనుకుంటున్నారేమో.. పేరు చెప్పకూడదు)కి అల్లు అర్జున్ సపోర్ట్ లభించింది. జానీ తన సినిమాల్లో మంచి కొరియోగ్రఫీ చేసినా.. అతను చేసింది హండ్రెడ్ పర్సెంట తప్పు. ప్రతిభ ఉంది కదా అని అడ్డగోలుగా ప్రవర్తిస్తే వారికి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా.. అందుకే ఐకన్ స్టార్ ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తూ.. ఇకపై తన అన్ని సినిమాల్లో తనకు కొరియోగ్రఫీ ఛాన్స్ ఇస్తా అంటున్నాడు.అంతే కాదు.. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మించే సినిమాలకు కూడా కొరియోగ్రాఫర్ ఛాన్స్ ఇస్తా అని ప్రామిస్ చేశాడట. ప్రస్తుతం ఇండస్ట్రీ నుంచి ఆ అమ్మాయి వెనక ఉన్న పెద్ద స్టార్ కూడా అల్లు అర్జునే అనే ప్రచారం జరుగుతోంది. మరి అల్లు అర్జున్ మాట నిలబెట్టుకుంటే కనుక ఖచ్చితంగా మంచి కొరియోగ్రఫీ చూస్తాం. ఎందుకంటే ఆ అమ్మాయి కూడా ఎక్స్ ట్రీమ్ లీ టాలెంటెడ్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com