Allu Arjun : అల్లు అర్జున్ బర్త్ డే గిఫ్ట్ అదేనా

ఐకన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప 2 తర్వాత ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయాడు అంటే అతిశయోక్తి కాదు. ఓ సాధారణ కమర్షియల్ మాస్ మూవీతో ఏకంగా 1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం అంటే చిన్న విషయం కాదు కదా. ఫస్ట్ పార్ట్ మెప్పించింది. అది సెకండ్ పార్ట్ కు మంచి ఓపెనింగ్స్ తో భారీ కలెక్షన్స్ ను తెచ్చింది. సుకుమార్ డైరెక్షన్ లోనే రూపొందినా ఈ చిత్రానికి దాదాపు అన్నీ తానే అయినట్టు కనిపించాడు అల్లు అర్జున్. హైదరాబాద్ లో అనుకోని విషాదం జరిగినా అతని రేంజ్ మారలేదు.
పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ తో మైథలాజికల్ మూవీ చేస్తాడు అన్నారు. కానీ ఆ ప్రాజెక్ట్ ను ప్రస్తుతం హోల్డ్ లో పెట్టారు. త్రివిక్రమ్ కంటే ముందు తమిళ్ డైరెక్టర్ అట్లీతో సినిమా ఓకే అయింది. ఇది కూడా ప్యాన్ ఇండియా సినిమానే. అయితే ఇప్పటి వరకూ వచ్చిన మూవీస్ కంటే భిన్నంగా కనిపిస్తుందని టాక్. ఇంటర్నేషనల్ ఆడియన్స్ కు కూడా రీచ్ అయ్యేలా హాలీవుడ్ రేంజ్ మేకింగ్, టేకింగ్ తో కనిపించబోతోందంటున్నారు. నలుగురైదురుగు హీరోయిన్లు కూడా ఉంటారని టాక్. ఇక ఈ మూవీతో అల్లు అర్జున్ ఇండియాలోనే హయ్యొస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోగా మారాడు అనే వార్తలు కూడా ఉన్నాయి. అలాగే ఇండియాలోనే ఇప్పటి వరకూ ఏ సినిమాకూ లేనంత భారీ బడ్జెట్ తో ఈ మూవీని రూపొందించబోతున్నారట. కోలీవుడ్ నుంచి సన్ పిక్చర్స్ బ్యానర్ ఈ ప్రాజెక్ట్ ను నిర్మించబోతోంది.
ఇక ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ ను అల్లు అర్జున్ బర్త్ డే రోజు చేయబోతున్నారు. ఆ రోజు ఏదైనా స్పెషల్ గ్లింప్స్ కూడా విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారని టాక్. అంటే ఏప్రిల్ 8న ఈ అత్యంత భారీ బడ్జెట్ మూవీకి సంబంధించిన డీటెయిల్స్ ను ప్రకటించబోతున్నారన్నమాట.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com