Akhanda : అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్‌‌‌గా బన్నీ..!

Akhanda : అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్‌‌‌గా బన్నీ..!
Akhanda : నందమూరి నటసింహం, బోయపాటి కాంబినేషన్‌‌లో వస్తోన్న చిత్రం 'అఖండ'. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, టీజర్ సినిమా పైన భారీ అంచనాలను క్రియేట్ చేశాయి.

Akhanda : నందమూరి నటసింహం, బోయపాటి కాంబినేషన్‌‌లో వస్తోన్న చిత్రం 'అఖండ'. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, టీజర్ సినిమా పైన భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. డిసెంబర్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 27 సాయంత్రం హైదరాబాదు శిల్పకళా వేదికలో సాయంత్రం జరగనుంది.

అయితే ఈ ఈవెంట్ కి మెగా హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా వస్తున్నాడు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఒకే వేదికపై బాలయ్య, బన్నీ కనిపించబోతుండడంతో అభిమానులు ఖుషి అవుతున్నారు. ఇక అఖండ సినిమాలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది.

జగపతిబాబు, శ్రీకాంత్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ద్వారకా క్రియేషన్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాని నిర్మించగా తమన్ సంగీతం అందిచాడు. సింహ, లెజెండ్ చిత్రాల తర్వాత బాలయ్య, బోయపాటి కాంబినేషన్ నుంచి వస్తోన్న సినిమా కావడంతో సినిమా పైన భారీ అంచనాలున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story