Allu Arjun: 'అతడికి మ్యూజిక్ అవసరం లేదు'.. యంగ్ సింగర్‌పై బన్నీ కామెంట్స్..

Allu Arjun (tv5news.in)

Allu Arjun (tv5news.in)

Allu Arjun: ముందుగా పుష్ప సినిమా నుండి దాక్కో దాక్కో మేక పాట విడుదలయ్యింది.

Allu Arjun: అల్లు అర్జున్ చివరి సినిమా 'పుష్ప' ఇప్పటికీ ఎన్నో రికార్డులను బ్రేక్ చేసుకుంటూ వెళ్తోంది. ఈ సినిమా విడుదలయిన నెలరోజులు గడిచినా, ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నా కూడా ఇంకా పలు థియేటర్లలో పుష్పకు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గట్లేదు. కలెక్షన్ల విషయంలో పుష్ప కొత్త రికార్డులనే సృష్టించింది. అయితే తాజాగా ఈ సినిమాలో పాట పడిన ఓ యంగ్ సింగర్ గురించి అల్లు అర్జున్ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు.

ముందుగా ఒక సినిమాలోని పాటలే ప్రేక్షకుల ముందుకు వస్తాయి. ఆ పాటలు ప్రేక్షకులు ఎంతగా అలరిస్తాయి అనేదానిపై కూడా ఎంతోకొంత సినిమా సక్సెస్ ఆధారపడుతుంది. అందుకే ఈ మధ్య మూవీలోని సాంగ్స్‌పై కూడా ఎక్కువగా దృష్టిపెడుతున్నారు దర్శక నిర్మాతలు. అలా పుష్ప సినిమా నుండి విడుదలయిన ప్రతీ పాట బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇప్పటికీ చాలామంది ఈ పాటలను లూప్ మోడ్‌లో వింటున్నారు కూడా.

ముందుగా పుష్ప సినిమా నుండి దాక్కో దాక్కో మేక పాట విడుదలయ్యింది. ఇది అల్లు అర్జున్ మ్యానరిజంను వివరించే పాట కావడంతో మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. వెంటనే 'శ్రీవల్లి' అంటూ డ్యూయట్‌ను విడుదల చేసింది మూవీ టీమ్. ఈ పాట సిడ్ శ్రీరామ్ పాడడంతో విడుదలయిన కొన్నిరోజుల్లోనే సూపర్ సక్సెస్ అయ్యింది. అయితే పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సిడ్ శ్రీరామ్ పాడిన శ్రీవల్లి పాటను గుర్తుచేసుకుంటూ అల్లు అర్జున్ ఇటీవల ఓ పోస్ట్‌ను షేర్ చేశాడు.


'ఈ సమయంలో మామూలుగా ఇది రాయాలనుకుంటున్నాను. నా సోదరుడు సిడ్ శ్రీరామ్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో స్టేజ్‌పై శ్రీవల్లి పాట పాడారు. అతడు ఏ మ్యూజిక్ లేకుండా పాడడం మొదలుపెట్టాడు. మెల్లగా మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ అతడి వాయిస్‌ను సపోర్ట్ చేస్తాయనుకున్నాను. కానీ అలా జరగలేదు. అతడు మ్యూజిక్ లేకుండానే పాడడం మొదలుపెట్టాడు. అతడి పాట ఒక మ్యాజిక్ లాగా ఉందని నా మనసులో అనుకున్నాను. అతడికి మ్యూజిక్ అవసరం లేదు. అతడే ఒక మ్యూజిక్' అంటూ సిడ్ శ్రీరామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పర్ఫార్మెన్స్ వీడియోను షేర్ చేశాడు బన్నీ.


Tags

Read MoreRead Less
Next Story