Allu Arjun : నీవల్లే ఇదంతా.. బన్నీ ఎమోషనల్ స్పీచ్ .. కంటతడి పెట్టిన సుక్కు..!

Allu Arjun : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ పుష్ప.. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించగా, దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించాడు. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. సినిమాకి ముందునుంచి మంచి టాక్ రావడంతో వసూళ్ళ పరంగా సినిమా దూసుకుపోతోంది. సినిమాకి సక్సెస్ టాక్ రావడంతో చిత్ర యూనిట్ థ్యాంక్యూ మీట్‌ను నిర్వహించింది. ఇందులో హీరో అల్లు అర్జున్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు.
"చాలా తక్కువమందికి మాత్రమే నా జీవితంలో రుణపడి ఉన్నాను అనే పదాన్ని వాడతాను.. అందులో . రైతుగా ఉన్న మా తాత(అల్లు రామలింగయ్య)సినిమాల్లోకి రాకపోతే మేము ఇప్పుడు ఈ స్థాయిలో ఉండేవాళ్లం కాదు. ఆ తర్వాత నా తల్లిదండ్రులకి, నన్ను ప్రోత్సహిస్తున్న చిరంజీవిగారికి రుణపడి ఉన్నాను అనే మాట వాడతాను.. ఆ తర్వాత అలాంటి మాట వాడేది సుకుమార్ కే... నాకు సుకుమార్ అంటే అంత ఇష్టం నాకే తెలియదు.. పరుగు సినిమా సమయంలో నేను 85 లక్షలు పెట్టి ఓ కారు కొన్నాను. స్టీరింగ్‌పై చేయివేసి.. నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఎవరని ఆలోచించగా...నాకు ఫస్ట్ గుర్తొచ్చిన పేరు సుకుమార్... నువ్వు లేకపోతే నేను లేను సుక్కు.. ఇప్పుడు నా లైఫ్ ఇలా సక్సెస్ ఫుల్ గా సాగుతుందంటే అది నీవల్లే అంటూ చెప్పుకొచ్చాడు.
ఈ స్పీచ్ వింటూ దర్శకుడు సుకుమార్ కంటతడి పెట్టాడు. దీనికి సంబంధించిన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
— Confused Atma (@anubunnyfreak) December 28, 2021
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com