Allu Arjun Fan : అల్లు అర్జున్ ఫ్యాన్ అతి పెద్ద సాహసం

Allu Arjun Fan :   అల్లు అర్జున్ ఫ్యాన్ అతి పెద్ద సాహసం
X

అభిమానానికి హద్దులు లేవంటారు. అందుకు ఎన్నో ఉదాహరణలు చూశాం.. చూస్తున్నాం. అభిమాన హీరోలను కలవడానికి చాలామంది మైళ్ల కొద్దీ కాలి నడకన వచ్చి మరీ కలుస్తుంటారు. ఇంకొందరు మోకాళ్లపై గుడి మెట్లు ఎక్కుతుంటారు. అయితే ఇది వాటన్నికంటే మించిన కేస్. ఓ రకంగా పెద్ద సాహసం కూడా. దేశవ్యాప్తంగా లక్షలాది అభిమానులున్న హీరో అల్లు అర్జున్. అతన్ని చూడటం కోసం ఉత్తర ప్రదేశ్ లోని అలీఘడ్ కు చెందిన మోహిత్ అనే అభిమాని ఏకంగా 1750 కిలోమీటర్లు సైకిల్ ప్రయాణించి మరీ వచ్చాడు.

విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ అతన్ని పిలిపించి అతని కోరిక మేరకు ఫోటోస్ తీయించి ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అలాగే సదరు మోహిత్ అనే అభిమాని ఈ సందర్భాన్ని తన ఇన్ స్టా పేజ్ లో ఉద్వేగంగా రాసుకున్నాడు. అల్లు అర్జున్ ను కలవాలనే తన చిరకాల కోరిక నెరవేరిందంటూ ఆనందాన్ని పంచుకున్నాడు. అలాగే నెక్ట్స్ పుష్ప 2 ప్రమోషన్స్ కు ఉత్తరప్రదేశ్ కు వస్తే అతన్ని కలుస్తా అని అల్లు అర్జున్ చెప్పినప్పుడు మరింత భావోద్వేగానికి గురయ్యాడు మోహిత్.

అయితే మోహిత్ సైకిల్ పై వచ్చాడని తెలుసుకున్న అల్లు అర్జున్ ఆశ్చర్యపోతూనే.. మళ్లీ సైకిల్ పైనే వెళ్లొద్దని చెబుతూ.. తన టీమ్ ద్వారా టికెట్స్ అరేంజ్ చేయించాడు.మొత్తంగా అభిమానానికి హద్దులు లేవని తెలుసు కానీ.. మరీ ఇలానా అని ఆశ్చర్యపోతున్నవాళ్లూ ఉన్నారు. ఎందుకంటే సైకిల్ పై 1750 కిలోమీటర్లు కేవలం తన అభిమాన హీరోను చూడ్డానికే రావడం అనేది అతి పెద్ద సాహసం. మరి ఈ అభిమానానికి ఏ పేరు పెట్టాలో మీరే డిసైడ్ చేసుకోండి.

Tags

Next Story