Allu Arjun : ప్యాన్ ఇండియా రీ రిలీజ్ కి అల్లు అర్జున్ ఫ్యాన్స్ మూవీ

Allu Arjun :  ప్యాన్ ఇండియా రీ రిలీజ్ కి అల్లు అర్జున్ ఫ్యాన్స్ మూవీ
X

ఐకన్ స్టార్ గా తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. పుష్ప 2తో ప్యాన్ ఇండియా రేంజ్ లో కలెక్షన్స్ పరంగా ఓ కొత్త బెంచ్ మార్క్ ను సెట్ చేశాడు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో సినిమాకు రెడీ అవుతున్నాడు. అంతకు ముందే కమిట్ అయిన త్రివిక్రమ్ సినిమా ప్రస్తుతానికి హోల్డ్ లో ఉంది. నెక్ట్స్ మంత్ ఐకన్ స్టార్ బర్త్ డే ఉంది. ప్రస్తుతం స్టార్ హీరోల ఓల్డ్ మూవీస్ ను వాళ్ల బర్త్ డే టైమ్ లోనో లేక ఏదైనా స్పెషల్ టైమ్స్ లోనో రీ రిలీజ్ చేయడం ట్రెండ్ గా ఉంది కదా.. అందుకే అల్లు అర్జున్ మూవీని కూడా రీ రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారు ఫ్యాన్స్. ఇందుకోసం ఓ డిఫరెంట్ మూవీని సెలెక్ట్ చేసుకోవడం విశేషం.

అల్లు అర్జున్ కు హీరోగా స్టార్డమ్ తెచ్చింది సెకండ్ సినిమా అయిన ఆర్య. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈమూవీ అప్పట్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ హైలెట్ గా నిలిచింది. అలాంటి మూవీకి సీక్వెల్ గా ఆర్య 2 రూపొందించాడు సుకుమార్.

ఆర్య 2 లో అల్లు అర్జున్ తో పాటు నవదీప్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలు చేశారు. ఈ మూవీలో హీరోగా కాక అప్పుడప్పుడూ నెగెటివ్ టచ్ తో కూడా కనిపించే పాత్ర చేశాడు అల్లు అర్జున్. అప్పటికే అతనికి స్టార్డమ్ వచ్చింది. అయినా ఇలాంటి పాత్ర చేశాడు అంటే అతని ప్యాషన్ ను అర్థం చేసుకోవచ్చు. అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్ అంతా డిఫరెంట్ గా ఉంటుంది. కాకపోతే భారీ అంచనాలుండటం, అతని క్యారెక్టర్ అప్పుడు కనెక్ట్ కాకపోవడంతో ఈ మూవీ ఆశించినంత పెద్ద విజయం సాధించలేదు. ఈ చిత్రాన్నే ఇప్పుడు అల్లు అర్జున్ బర్త్ డే అయిన ఏప్రిల్ 8న రీ రిలీజ్ చేయబోతున్నారు ఫ్యాన్స్.

అయితే రెగ్యులర్ గా తెలుగులోనే కాక ప్యాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందా అనే ఆలోచన చేస్తున్నారట. ఐకన్ స్టార్ కు మళయాలంలో మంచి స్టార్డమ్ ఉంది. పుష్ప 2 తో దేశవ్యాప్తంగా పాపులారిటీ వచ్చింది. ఈ టైమ్ లో ఈ మూవీని ప్యాన్ ఇండియా రేంజ్ లో రీ రిలీజ్ చేస్తే రీ రిలీజ్ లలో కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టినట్టు ఉంటుందని భావిస్తున్నారట. మరి వర్కవుట్ అవుతుందా లేదా అనేది చూడాలి.

Tags

Next Story