Allu Arjun : పుష్ప సిగ్నేచర్ వాక్ ఐడియా అలా వచ్చింది : అల్లు అర్జున్

Allu Arjun : పుష్ప సిగ్నేచర్ వాక్ ఐడియా అలా వచ్చింది : అల్లు అర్జున్
X
Allu Arjun : పుష్ప సిగ్నేచర్ వాక్ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది.

Allu Arjun : పుష్ప సిగ్నేచర్ వాక్ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. అయితే దీని వెనక ఉన్న చరిత్రను అల్లు అర్జున్ ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. పుష్ప వాకింగ్ క్రెడిట్ మొత్తం దర్శకుడు సుకుమార్‌కు దక్కాలన్నారు స్టైలిష్ స్టార్.

పుష్ప షూటింగ్ స్టార్ట్ కాకముందు సుకుమార్ పిలిచి ఓ ప్రత్యేకమైన బాడీ ల్యాంగ్వేజ్ వాకింగ్ స్టైల్‌ను రెడీ చేసుకోమన్నారు. అప్పుడు నేను స్పాట్‌లోనే ఓ భుజంపైకెత్తి నడిచా.. అంతే.. సుకుమార్ దాన్నే సినిమాలో అడాప్ట్ చేశారు. పుష్ప సిగ్నేచర్ వాక్ ఇంత పాపులర్ అవుతుందని అస్సలు అనుకోలేదని అన్నారు. ప్రస్తుతం ''పుష్ప 2'' షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. త్వరలోనే ఇది సెట్స్ పైకి వెళ్లనుంది.

Tags

Next Story