Allu Arjun Got Bail : అల్లు అర్జున్ కు పెద్ద రిలీఫ్ దొరికింది

సంధ్య థియేటర్ దుర్ఘటనలో ఏ 11 గా ఉన్న అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. నిజానికి ఈ కేస్ ఇంకా కొన్నాళ్ల పాటు కొనసాగుతుందనీ.. కోర్ట్ లో అతనికి బెయిల్ రాదని చాలామంది భావించారు. అందుకు కారణం బలమైన ఆధారాలు సేకరించిన పోలీస్ లు అల్లు అర్జున్ కు వ్యతిరేకంగా చార్జిషీటు తయారు చేసి కోర్ట్ లో సమర్పించాలనుకున్నారు. అంతే కాక దీన్ని ప్రభుత్వం కూడా పర్సనల్ గా తీసుకుందనే వాదనలు వినిపించాయి. డిసెంబర్ 30నే రావాల్సిన బెయిల్ తీర్పును కోర్ట్ జనవరి 3కి వాయిదా వేసింది. ఈ కారణంగా కూడా కొంత ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం మధ్యంతర బెయిల్ మీద ఉన్నాడు అల్లు అర్జున్. ఒకవేళ కోర్ట్ లో బెయిల్ రద్దయితే మళ్లీ జైలుకు వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి కొంత ఆందోళన కూడా కనిపించింది. బట్ నాంపల్లి కోర్ట్ అల్లు అర్జున్ కు బెయిల్ మంజూరు చేయడంతో ఫ్యామిలీతో పాటు ఫ్యాన్స్ కూడా పెద్ద రిలీఫ్ గా ఫీలవుతున్నారు.
రూ.50 వేలు, రెండు పూచీకత్తులపై రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది కోర్ట్. సో.. ఇక అల్లు అర్జున్ ఫ్రీగా ఉండొచ్చు. పుష్ప 2 సంబరాలు మొదలుపెట్టనూ వచ్చు. బట్ ఇకపై ఇలాంటి పబ్లిక్ ఇష్యూస్ తో అతనే కాదు.. ఎంటైర్ ఇండస్ట్రీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందని ఈ కేస్ ఓ హెచ్చరికగా నిలిచిపోయింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com