Allu Arjun: పెళ్లికి ముందు ఆ హీరోయిన్‌తో ప్రేమలో పడిన అల్లు అర్జున్..

Allu Arjun: పెళ్లికి ముందు ప్రేమకథలు అనేవి చాలా కామన్. ఎవరికైనా ఇది జరిగేదే. అయితే కొన్ని ప్రేమకథలు పెళ్లి వరకు వెళ్లగా చాలావరకు వన్ సైడ్ లవ్ స్టోరీస్‌గా మిగిలిపోతాయి. అయితే టాలీవుడ్‌లో స్టైలిష్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్‌కు కూడా పెళ్లికి ముందు ఓ ప్రేమకథ ఉందట. స్నేహా రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న బన్నీ.. అంతకు ముందే ఓ హీరోయిన్‌కు మనసిచ్చానని ఇటీవల బయటపెట్టాడు.
అల్లు అర్జున్.. ఇతర టాలీవుడ్ హీరోలతో పోలిస్తే తొందరగా పెళ్లి చేసుకున్నాడు. 2011లోనే తనకు స్నేహా రెడ్డితో వివాహం జరిగిపోయింది. దీంతో తన పర్సనల్ లైఫ్ గురించి, రిలేషన్‌షిప్స్ గురించి పెద్దగా రూమర్స్ ఏమీ రాలేదు. తర్వాత పూర్తిగా ఫ్యామిలీ మ్యాన్ అయిపోవడంతో ప్రేక్షకులు తన ఫ్యామిలీ లైఫ్ గురించి లోతుగా పరిశీలించడం మానేశారు.
అయితే పెళ్లికి ముందు అల్లు అర్జున్‌కు ఐశ్వర్యా రాయ్ అంటే క్రష్ ఉండేదట. అంతే కాకుండా అది వన్ సైడ్ లవ్‌లాంటిదే అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు అల్లు అర్జున్. ఐశ్వర్యా రాయ్‌కు అభిషేక్ బచ్చన్‌తో పెళ్లయినప్పుడు చాలా బాధపడ్డానని తెలిపాడు బన్నీ. ఇక తాను చేస్తున్న సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం 'పుష్ప 2' కోసం కసరత్తు చేస్తున్నాడు అల్లు అర్జున్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com