Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కి అమెరికాలో అరుదైన గౌరవం..

Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కి అమెరికాలో అరుదైన గౌరవం..
Allu Arjun: పుష్పతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన అల్లు అర్జున్‌కి అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది.

Allu Arjun: పుష్పతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన అల్లు అర్జున్‌కి అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. దీనికి సంబంధించిన వీడియోను అభిమానులతో పంచుకున్నారు బన్నీ సోషల్ మీడియా వేదికగా. న్యూయార్క్‌లో జరిగే వార్షిక ఇండియా డే పరేడ్‌లో దేశం తరపున గ్రాండ్ మార్షల్‌గా ప్రాతినిధ్యం వహించాలని అల్లు అర్జున్‌ని ఆహ్వానించారు అక్కడ నివసిస్తున్న ప్రవాస భారతీయులు.

భారతదేశానికి 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన ప్రముఖ కవాతు సందర్భంగా అభిమానులు ఆయనకు జైకొట్టారు. ఆదివారం నాడు జరిగిన ఈ ఈవెంట్‌కు సంబంధించిన విశేషాలను, వీడియోలను బన్నీ పంచుకున్నారు. పరేడ్‌లో బన్నీ భార్య స్నేహారెడ్డి కూడా పాల్గొన్నారు.

అనంతరం అతడికి గ్రాండ్ మార్షల్ బిరుదు ఇచ్చి సత్కరించారు, బన్నీపై తమకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. పరేడ్‌లో జాతీయ జెండాను ఎగురవేసిన వీడియోను షేర్ చేస్తూ, అల్లు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఇలా రాశారు, "న్యూయార్క్‌లో జరిగిన ఇండియా డే పరేడ్‌లో భాగం కావడం, గ్రాండ్ మార్షల్ బిరుదుతో గౌరవం పొందడం ఆనందంగా ఉంది." అని పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story