అల్లు అర్జున్.. 'ఐకన్'పై అంత లో ప్రొఫైల్ ఎందుకో..?

అల్లు అర్జున్.. ఐకన్పై అంత లో ప్రొఫైల్ ఎందుకో..?
పుష్ప తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా ఐకనే అంటూ కన్ఫార్మ్ చేశాడు బన్నీవాస్.

స్టైలిష్ స్టార్ గా తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్నాడు అల్లుఅర్జున్. టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకడుగా వెలుగుతున్నాడు. అల వైకుంఠపురములో మూవీ రికార్డ్స్ తో తన తరం హీరోలకు సవాల్ కూడా విసిరాడు. ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో హ్యాట్రిక్ మూవీగా పుష్ప చేస్తున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగేసినిమా ఇది. ఫస్ట్ టైమ్ ఊరమాస్ గెటప్ లో కనిపించబోతున్నాడు అల్లు అర్జున్. రీసెంట్ గావిడుదలైన టీజర్ సైతం వెరీ ప్రామిసింగ్ గాఉంది.

పుష్ప తర్వాత కొరటాల శివ డైరెక్షన్ లో సినిమా అనౌన్స్ అయ్యి ఆగిపోయింది. దీంతో అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీ ఏంటా అని అంతా అనుకుంటోన్న టైమ్ లో పుష్ప సెకండ్ పార్ట్ ఉంటుందని చెప్పి ఆశ్చర్యపరిచారు. సో.. అతని తర్వాతి సినిమా అదే అవుతుందనుకున్నారు. కానీ పుష్ప తర్వాత అల్లు అర్జున్ సెకండ్ పార్ట్ చేయడం లేదు. మరో సినిమా చేస్తున్నాడని అతని క్యాంప్ కు చెందిన బన్నీవాస్ రివీల్ చేశాడు.

కొన్నాళ్ల క్రితం అల్లు అర్జున్ వరుసగా కొన్ని సినిమాలు అనౌన్స్ చేశాడు. అందులో అల వైకుంఠపురములో తర్వాత చేయాల్సిన సినిమా ఐకన్. దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో రావాల్సిన సినిమా. కానీ ఆ ప్రాజెక్ట్ ను పక్కనబెట్టి.. ఇప్పుడు పుష్ప చేస్తున్నాడు. దీంతో ఐకన్ ఆగిపోయిందనుకున్నారు. బట్.. పుష్ప తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా ఐకనే అంటూ కన్ఫార్మ్ చేశాడు బన్నీవాస్. అంతా బానే ఉంది కానీ..ఈ విషయం అటు దర్శకుడు, ఇటు నిర్మాత ఇప్పటి వరకూ ఎప్పుడూ ఎందుకు చెప్పలేదు. సడెన్‌గా బన్నీవాస్ చెప్పడం వెనక ఉద్దేశ్యం ఏంటనేది ఎవరికీ అర్థం కావడం లేదు.

Tags

Read MoreRead Less
Next Story