Allu Arjun : రాజకీయాల్లోకి అల్లు అర్జున్..?

సినిమా వాళ్లు రాజకీయాల్లోకి రావడం కొత్తేం కాదు కాబట్టి కొన్ని వార్తలు అలా అంటుకుపోతుంటాయి. ప్రస్తుతం పుష్ప 2 తో ప్యాన్ ఇండియా స్థాయిలో రికార్డ్ బ్రేకింగ్ విజయాన్ని అందుకుని దూసుకుపోతున్నాడు అల్లు అర్జున్. అలాంటి వారిపై రకరకాల వార్తలు వస్తుండటం కామన్. అయితే అల్లు అర్జున్ పై రావడం కామన్ మాత్రమే కాదు.. కాస్త ఇంట్రెస్టింగ్ గానూ ఉంటుంది. ఎందుకంటే కొన్నాళ్లుగా అతను పొలిటికల్ సినారియోలో కనిపిస్తున్నాడు. అతని సినిమాను ఆపేస్తాం అని ఒక పార్టీ నాయకులు ఓపెన్ గానే ప్రకటించిన సందర్భాలూ చూశాం. ఇటు సినిమాలో కూడా పొలిటికల్ హీట్ కనిపిస్తుంది. ఓ సిఎమ్ వల్ల హర్ట్ అయిన పుష్పరాజ్ ఆ సిఎమ్ నే మార్చేస్తాడు. ఇవన్నీ సినిమాల్లో సాధ్యం. నిజంలో కూడా సాధ్యం అవుతాయి అనుకునే వాళ్లు అమాయకులు అని వేరే చెప్పక్కర్లేదు. అయితే మేటర్ హీటు మీదుంది కాబట్టి.. వెంటనే అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తున్నాడు అనే రూమర్ స్టార్ట్ అయింది..
ఇలాంటివి ఎంత త్వరగా ఆపేస్తే అంత మంచిది. లేదంటే అసలుకే ఎసరు తెస్తాయి. అందుకే ఐకన్ స్టార్ టీమ్ వెంటనే అలెర్ట్ అయింది. అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రావడం లేదూ.. ఇవన్నీ ఒట్టి గాసిప్ లు. కావున ప్రజలెవురూ వీటిని నమ్మొద్దూ అంటూ ఒక లెటర్ పెట్టారు సోషల్ మీడియాలో. అస్సలు ఏ మాత్రం నిజం లేదీ వార్తలో అంటూనే.. అల్లు అర్జున్ కు సంబంధించిన న్యూస్ ఏదైనా ఆయన టీమ్ నుంచి అఫీషియల్ గా వస్తుంది. అప్పుడే నమ్మాలి తప్ప.. ఇలాంటివి నమ్మొద్దు అంటున్నారు. అదీ మేటర్. సో.. అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తున్నాడు అనేది ఇప్పటికైతే నిజం కాదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com