సినిమా

Allu Arjun: 'అఖండ' సినిమాపై ఆధారపడ్డ అల్లు అర్జున్ ఫ్యూచర్..

Allu Arjun: ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప సినిమాలో బిజీగా ఉన్నాడు.

Allu Arjun (tv5news.in)
X

Allu Arjun (tv5news.in)

Allu Arjun: ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప సినిమాలో బిజీగా ఉన్నాడు. తన క్లోజ్ ఫ్రెండ్ సుకుమార్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. సుకుమార్ మీద ఉన్న నమ్మకంతో డీ గ్లామర్‌గా కనిపించడానికి కూడా వెనకాడలేదు. అల్లు అర్జున్ కెరీర్‌లో ముందెన్నడూ లేని డిఫరెంట్ లుక్‌తో పుష్పలో కనిపిస్తున్నాడు. అయితే పుష్ప తర్వాత అల్లు అర్జున్ ప్లాన్స్ ఏంటి అనేదానిపై పెద్ద కన్ఫ్యూజనే ఏర్పడింది.

పుష్పను రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్టు మూవీ టీమ్ ఇప్పటికే ప్రకటించింది. పుష్పలో మొదటి భాగం పుష్ప ది రైజ్ డిసెంబర్‌లో విడుదలకు సిద్ధమయ్యింది. ఇక రెండో భాగాన్ని వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి పుష్ప తర్వాత అల్లు అర్జున్ ఎవరితో సినిమా చేయనున్నారు అనేదానిపై ఇంకా క్లారిటీ లేదు.

ఇప్పటికే మూడు సినిమాలను ఒప్పుకుని పక్కన పెట్టేసిన అల్లు అర్జున్ తరువాతి స్టెప్ ఏంటో ఎవ్వరికీ అర్థం కావట్లేదు. చివరిగా బోయపాటితో సినిమా చేయాలని డిసైడ్ అయ్యారట అల్లు అర్జున్. కానీ దానికి కూడా ఒక కండిషన్ పెట్టారట. ప్రస్తుతం బోయపాటి.. బాలక‌ృష్ణతో తెరకెక్కించిన 'అఖండ' హిట్ అయితేనే అల్లు అర్జున్, బోయపాటి కాంబినేషన్ మరోసారి కుదిరే ఛాన్స్ ఉందని టాక్.

Next Story

RELATED STORIES