Ram Charan : రామ్ చరణ్ కంటే అల్లు అర్జున్ డేంజరా

పుష్ప 2 కు గేమ్ ఛేంజర్ రిలీజ్ కు మధ్య నెల రోజులకు పైనే గ్యాప్ ఉంది. అయినా ఈ రెండు సినిమాలను కంపేర్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఎవరి సినిమాకు ఎక్కువ ఓపెనింగ్స్ వస్తాయి.. ఫస్ట్ డే కలెక్షన్స్ లో ఎవరిది అప్పర్ హ్యాండ్ కాబోతోంది. ఫైనల్ కలెక్షన్స్ లో ఎవరు కింగ్ అనిపించుకుంటారు అనే కాలిక్యులేషన్స్ తో నిత్యం సోషల్ మీడియాలో డైలాగ్ వార్స్ నడుస్తూనే ఉన్నాయి. అవన్నీ ఎలా ఉన్నా.. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్, రష్మిక మందన్నా, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఛావా సినిమాను మొదట డిసెంబర్ 6న విడుదల చేయాలనుకున్నారు. ఆ టైమ్ లో అదే డేట్ లో పుష్ప 2 కూడా ఉంది. దీంతో రష్మిక మందన్నా నటించిన రెండు సినిమాలు ఒకే రోజు విడుదలవుతున్నాయి అనే వార్తలు కూడా వచ్చాయి. అయితే పుష్ప 2 క్రేజ్ చూసి ఛావా వెనక్కి తగ్గింది. తాము డిసెంబర్ బరి నుంచి తప్పుకుంటున్నాం అని ప్రకటించారు మేకర్స్.
పుష్ప 2తో పోటీ పడలేక తప్పుకున్నా ఛావా టీమ్ ఇప్పుడు రామ్ చరణ్ తో పోటీకి సై అంటోంది. ఈ మూవీని సంక్రాంతి బరిలో జనవరి 10న విడుదల చేయాలుకుంటున్నట్టు బాలీవుడ్ కబుర్స్ చెబుతున్నాయి. అంటే అల్లు అర్జున్ తో పోటీ పడితే తమకే లాస్ .. బట్ రామ్ చరణ్ తో సమస్య లేదా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. రామ్ చరణ్ ను గ్లోబల్ స్టార్ అంటున్నారు. అల్లు అర్జున్ ఇప్పుడిప్పుడే ప్యాన్ ఇండియా స్టార్ అవుతున్నాడు. అయినా బన్నీతో పోటీకి నై అని చరణ్ తో సై అంటున్నారు అంటే వీరి స్ట్రాటజీ ఏంటో అర్థం కావడం లేదు చాలామందికి. ఏదేమైనా దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని ఐకన్ స్టార్ ఫ్యాన్స్ మరోసారి రెచ్చిపోతారని వేరే చెప్పక్కర్లేదేమో.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com