Allu Arjun: పునీత్ రాజ్‌కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన అల్లు అర్జున్..

Allu Arjun: అప్పటివరకు అందరితో కలిసి సంతోషంగా గడిపి, తన అన్న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు స్టెప్పులేసి, జిమ్‌కు వెళ్లొస్తానని చెప్పి వెళ్లిన పునీత్ రాజ్‌కుమార్ తిరిగి రాలేదు. ఆ ఘటనే కేవలం కర్ణాటకను మాత్రమే కాదు దేశవ్యాప్తంగా చాలామంది సినీ ప్రియులను కలచివేసింది. అక్టోబర్ 29న జరిగిన ఈ ఘటన నుండి శాండిల్‌వుడ్ ప్రేక్షకులు ఇంకా కోలుకోలేదు. తాజాగా ఈ హీరో ఫ్యామిలీని పరామర్శించాడు అల్లు అర్జున్.
'పుష్ప' సినిమా ప్రమోషన్స్ కోసం దేశంలోని అన్ని ప్రధాన నగరాలను చుట్టేశాడు బన్నీ. ఆ సందర్భంలోనే కర్ణాటకకు కూడా వెళ్లారు. అయితే ఎలాగో కర్ణాటక వచ్చినందుకు పునీత్ రాజ్‌కుమార్ ఫ్యామిలీని కలుస్తారా అని అక్కడ మీడియాను అడగగా.. 'నా పని మీద వచ్చినప్పుడు అలా వెళ్లి కలవడం మర్యాద కాదు. కచ్చితంగా వారి ఫ్యామిలీని కలవడానికి మరొకసారి వస్తాను' అని అందరి ముందు ప్రకటించారు. అన్నట్టుగానే నేడు అల్లు అర్జున్.. పునీత్ రాజ్‌కుమార్ ఇంటికి వెళ్లాడు.
ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోలు ఎందరో పునీత్ రాజ్‌కుమార్ కుటుంబాన్ని పరామర్శించారు. తాజాగా బన్నీ కూడా బెంగుళూరులోని పునీత్ నివాసానికి వెళ్లి వారితో కాసేపు మాట్లాడారు. ఆ తర్వాత పునీత్ సమాధి దగ్గరకు వెళ్లి నివాళులు అర్పించారు. తెలుగులోని ఇతర హీరోలలాగానే అల్లు అర్జున్‌కు, పునీత్ రాజ్‌కుమార్‌కు మంచి సాన్నిహిత్యం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com