Allu Arjun : పుష్ప రాజ్ తో అల్లు అర్జున్ కొత్త రికార్డ్

Allu Arjun : పుష్ప రాజ్ తో అల్లు అర్జున్ కొత్త రికార్డ్
X

అల వైకుంఠపురములో తర్వాత అల్లు అర్జున్ రేంజ్ ఓ రేంజ్ లో మారిందని అందరికీ తెలుసు. ముఖ్యంగా అతని సినిమా ఆడియోస్ అద్భుతంగా వర్కవుట్ అవుతున్నాయి. అంతకు ముందు కూడా బ్లాక్ బస్టర్ ఆడియోస్ ఉన్నా.. ఈ మూవీస్ తో కంట్రీ మొత్తం ఆకట్టుకుంటున్నాడు. అల వైకుంఠపురములో అయితే ఎల్లలు దాటి మరీ ఫేమ్ అయింది. ఆ రూట్ లోనే సుకుమార్ డైరెక్ట్ చేసిన పుష్ప -1 ఆడియో కూడా వాల్డ్ వైడ్ గా ఫేమస్ అయింది. పాటలతో పాటు ఆ సాంగ్స్ లోని హూక్ స్టెప్స్ ను వాల్డ్ వైడ్ గా ఉన్న టాప్ సెలబ్రిటీస్ అంతా రీ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలా పాటలతోనే చాలా రికార్డులు క్రియేట్ చేసిన పుష్పరాజ్ అకౌంట్ లో మరో రికార్డ్ చేరింది.

పుష్ప 2 నుంచి ఆ మధ్య విడుదలై పుష్ప పుష్ప.. అంటూ సాగే సాంగ్ యూ ట్యూబ్ లో ఏకంగా 150 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. ఈ కౌంట్ ఇంకా కంటిన్యూ అవుతోంది. సినిమా రిలీజ్ అయ్యే వరకూ ఓ పెద్ద రికార్డ్ కొట్టినా ఆశ్చర్యం లేదు అనే చెప్పాలి. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తోన్న ఈ మూవీలోని పాటలన్నీ చంద్రబోస్ రాస్తున్నాడు. ఫస్ట్ పార్ట్ లో కూడా చంద్రబోస్ రాసిన అన్ని సాంగ్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ పాటలో నిలబడే మోకాలి మరో కాలు పెట్టి ఐకన్ స్టార్ చేసిన స్టెప్స్ సైతం ఓ రేంజ్ లో పాపులర్ అయ్యాయి.

ఈ ఆగస్ట్ 15న విడుదల కావాల్సిన పుష్ప 2 షూటింగ్ కంప్లీట్ కాని కారణంగా పోస్ట్ పోన్ అయింది. ఇప్పటికైతే డిసెంబర్ 6న విడుదల చేస్తారు అని చెబుతున్నారు. మరికొందరు మాత్రం నెక్ట్స్ ఇయర్ సమ్మర్ లో ఏప్రిల్ లో విడుదలవుతుందని కూడా అంటున్నారు. బట్ మాగ్జిమం డిసెంబర్ 6నే వస్తుందనేది మేకర్స్ స్ట్రాంగ్ గా చెబుతోన్న మాట. మొత్తంగా పుష్ప పుష్ప పుష్పరాజ్ అంటూ సాగే ఈసాంగ్ యూ ట్యూబ్ ను షేక్ చేస్తోందనే చెప్పాలి.

Tags

Next Story