Allu Arjun: క్రేజీ కాంబో రిపీట్.. అల్లు అర్జున్ నెక్ట్స్ సినిమా అతడితోనే..
Allu Arjun: కాంబినేషన్స్ కు ఖచ్చితంగా క్రేజ్ ఉంటుంది. అయితే ఆ కాంబోలో అంతకు ముందు వచ్చిన చిత్రాలు బ్లాక్ బస్టర్ అయి ఉండాలి. అప్పుడే క్రేజ్. అలాంటి కాంబోస్ రిపీట్ అవుతున్నాయంటే ఆడియన్స్ లోనే కాదు.. బిజినెస్ లో కూడా కొత్త జోష్ కనిపిస్తుంది. ఇప్పుడు ఐకన్ స్టార్ అల్లు అర్జున్ కూడా అలాంటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్ కు ఓకే చెప్పాడు అనే వార్తలు వస్తున్నాయి.
2014లో అప్పటికే క్రేజీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకుని బాక్సాఫీస్ కు మంచి కిక్ ఇస్తోన్న సురేందర్ రెడ్డితో కలిసి రేస్ గుర్రం అనే సినిమా చేశాడు అల్లు అర్జున్. అతనితో పాటు శ్యామ్ కూడా ఓ హీరోగా నటించిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. సినిమా విజయంలో చివర్ లో ఓ ఇరవై నిమిషాల పాటు హల్చల్ చేసి ఆడియన్స్ ను ఓ రేంజ్ లో నవ్వించిన బ్రహ్మానందంకూ మేజర్ షేర్ ఉందని చెప్పొచ్చు.
ఆ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి కాస్త వెనకబడి పోయాడు. తర్వాత చేసిన కిక్2 పోయింది. అయితే ధృవ, సైరా సినిమాలతో మెప్పించినా.. ఎందుకో టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో ఇంకా చేరలేదేమో అనిపిస్తుంది. ప్రస్తుతం అక్కినేని అఖిల్ తో ఏజెంట్ అనే సినిమా చేస్తున్నాడు సురేందర్. అయితే ఈ చిత్రం ఎప్పటికి పూర్తవుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఇప్పటికే మూడు నాలుగు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసి వదిలేసుకున్నారు.
అలాంటి దర్శకుడితో అల్లు అర్జున్ నెక్ట్స్ సినిమా చేయబోతున్నాడు అనే వార్త టాలీవుడ్ లో వినిపిస్తోంది. కానీ ఇందులో నిజమెంత అనేది ఇంకా తేలాల్సి ఉంది. కాకపోతే ఇప్పుడున్న టాప్ డైరెక్టర్స్ లిస్ట్ చూస్తే పుష్ప తర్వాత అల్లు అర్జున్ కు మరో ఆప్షన్ కూడా పెద్దగా కనిపించడం లేదు. ఏదేమైనా రేస్ గుర్రం బ్లాక్ బస్టర్ కాబట్టి.. ఈ కాంబినేషన్ రిపీట్ అయితే ఖచ్చితంగా ఆ క్రేజ్ ఈ కొత్త సినిమాకూ ఉపయోగపడుతుంది. పైగా అప్పుడు స్టైలిష్ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్ ఇప్పుడు ఐకన్ స్టార్ అయ్యాడు కాబట్టి.. బిజినెస్ కూడా ప్యాన్ ఇండియన్ రేంజ్ లో ఉంటుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com