Allu Arjun: బంగారం.. నేను ఓడింది నువ్వు గెలవాలనే..: కూతురుతో అల్లు అర్జున్

Allu Arjun: సినిమాల్లో విలన్ల తాట తీస్తాడు.. దాంతో థియేటర్‌లో అభిమానుల చప్పట్లు. కానీ ఇంట్లో స్టైలిష్ స్టార్ కాదు, స్టార్ హీరో అంతకంటే కాదు.. చిన్నారుల అలకల్ని, ఆటల్ని ఎంజాయ్ చేసే ఓ సాధారణ తండ్రి.
అల్లు అర్జున్ గారాల పట్టి అర్హకు నాన్నతో ఆడడమంటే సరదా. సినిమాల్లో రఫ్పాడించినా పిల్లల దగ్గర మాత్రం వాళ్లు ఆడించినట్లే ఆడుతుంటాడు. ఏ తండ్రికైనా అందులోనే ఆనందం ఉంటుంది. అందుకు అర్జున్ కూడా మినహాయింపు కాదు. చిన్నారి అర్హతో గడిపే సంతోష సమయాల్ని అభిమానుల కోసం పోస్ట్ చేస్తుంటాడు బన్నీ.
తాజాగా తండ్రికి ఓ పొడుపు కథ ఇచ్చింది. 'గంగిగోవు పాలు గరిటెడైన చాలు' దానికి ఆన్సర్ చెప్పమంటూ నాన్నతో గారాలు పోయింది అర్హ. దానికి బన్నీ కూడా నాకు తెలియదు రా బంగారం అంటూనే.. ఏదో ఒకటి చెబితే కూతురు హ్యాపీగా ఫీలవుతుంది.. అదే తనకి ఆనందం అనుకుని 'జున్ను' అని తప్పు సమాధానం చెబుతాడు. దానికి అర్హ నవ్వుతూ ఓడిపోయావ్ అంటూ ఈసారి నాన్నకు మరో పరీక్ష పెడుతుంది.
ఓ టంగ్ ట్విస్టర్ ఇచ్చి గబగబా పలకమంటుంది. దానికి అల్లు అర్జున్ పలకలేక నవ్వుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేశాడు అల్లు అర్జున్. పోస్ట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే అది వైరల్ అయింది. సెలబ్రెటీలు కూడా ఈ వీడియోని ఎంజాయ్ చేస్తూ షేర్ చేస్తున్నారు. మరి మీరు కూడా చూసేయండి.
Adorable and Fun Moments between Father and Daughter ❤️✨
— BA Raju's Team (@baraju_SuperHit) September 20, 2022
Icon Star @alluarjun #AlluArjun having cute conversation with his daughter #AlluArha 🤩 pic.twitter.com/oM8bfXbqo3
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com