Allu Arjun: సారీ చెబితే మనిషి పెరుగుతాడు.. ఎక్కడా తగ్గడు

Allu Arjun: మరో రెండు రోజుల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తగ్గేదేలే అంటూ ప్రచార కార్యక్రమాన్ని వేగవంతం చేసింది చిత్ర యూనిట్. ఈ క్రమంలో బెంగళూరు వెళ్లింది పుష్ప టీమ్. ప్రెస్‌మీట్ రెండు గంటలు ఆలస్యం కావడంతో బన్నీ బెంగళూరు వాసులకు క్షమాపణ చెప్పాడు.
ఆలస్యమైనందుకు క్షమించండి.. ప్రైవేట్ ఫ్లైట్‌లో వచ్చాము. పొగమంచు కారణంగా ఫ్లైట్ టేకాఫ్‌లో ఇబ్బందులు తలెత్తాయి. అందుకే ఈ ప్రోగ్రామ్ ఆలస్యమైంది. మీడియాకు నా క్షమాపణలు.. సారీ చెబితే మనిషి పెరుగుతాడు.. ఎక్కడా తగ్గడని నా అభిప్రాయం అని చెప్పిన బన్నీ బెంగళూరు ఫ్యాన్స్ మనసు దోచుకున్నాడు.
సినిమా ప్రమోషన్‌లో భాగంగా బెంగళూరు రావడం ఆనందంగా ఉంది. ఇక్కడ పుట్టకపోయినా చిన్నప్పుడు వెకేషన్ ట్రిప్‌కు వస్తుండేవాళ్లం. నా సినిమాలు ఇక్కడ విడుదలవుతాయని కలలో కూడా ఊహించలేదు. నా స్నేహితుడు పునీత్ మరణవార్త నన్ను చాలా బాధించింది.
ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండడం వల్ల ఇంతవరకు బెంగళూరు రాలేకపోయాను.. ఇప్పుడు వచ్చినా పునీత్ కుటుంబాన్ని కలవాలనుకోవడం లేదు.. చిత్ర ప్రమోషన్‌కి వచ్చి కలిశానని అనిపించుకోవడం నాకు నచ్చదు అని బన్నీ తెలిపాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com