'పుష్ప' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్..!

పుష్ప మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్..!
కోవిడ్ కారణంగా పోస్ట్ పోన్ అయిన సినిమాల్లో పుష్ప ఒకటి. అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ మైత్రీ మూవీస్ సంస్థ పుష్ప చిత్రాన్ని నిర్మిస్తోంది.

కోవిడ్ కారణంగా పోస్ట్ పోన్ అయిన సినిమాల్లో పుష్ప ఒకటి. అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ మైత్రీ మూవీస్ సంస్థ పుష్ప చిత్రాన్ని నిర్మిస్తోంది. షూటింగ్ చివరిదశకు చేరుకున్న ఈ సినిమాకి రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు మేకర్స్. దసరా, సంక్రాంతి సీజన్స్ ఆల్ రెడీ పెద్ద సినిమాలతో ఫిల్ అయిపోవడంతో... డిసెంబర్ లో పుష్పని రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాని క్రిస్మస్ కు విడుద‌ల కానుందని స్పష్టం చేస్తూ మేకర్స్ ప్రత్యేక పోస్టర్ ను విడుద‌ల చేశారు. 'అల.. వైకుంఠపురములో' వంటి భారీ హిట్ తర్వాత అల్లు అర్జున్ నటిస్తోన్న సినిమా కావడంతో సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎర్ర చంద‌నం స్మగ్లింగ్ క‌థాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story