Allu Arjun : విచారణ ముగించుకుని ఇంటికి చేరిన అల్లు అర్జున్

Allu Arjun :  విచారణ ముగించుకుని ఇంటికి చేరిన అల్లు అర్జున్
X

ఐకన్ స్టార్ అల్లు అర్జున్ ను ఇవాళ చిక్కడపల్లి పోలీస్ లు విచారణ కోసం పిలిపించారు. ఈ నెల 4న సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహళ మరణానికి కారణమయ్యాడు అంటూ పోలీస్ లు కేస్ నమోదు చేశారు. ఇంతకు ముందే కోర్ట్ లో హాజరు పరిచారు. నాంపల్లి కోర్ట్ 14ల కస్టడీ విధించగా.. హై కోర్ట్ నుంచి మధ్యంతర బెయిల్ తెచ్చుకుని బయటకు వచ్చాడు అల్లు అర్జున్. అయితే రీసెంట్ గా తెలంగాణ అసెంబ్లీలో ఈ కేస్ కు సంబంధించి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించడం.. తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్లు కూడా విమర్శలు చేశారు. దీనికి కౌంటర్ గా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ రోజు ఏ పోలీస్ తన వద్దకు రాలేదనీ.. తన వ్యక్తిగత ప్రతిష్టను భంగం కలిగించేలా చాలామంది మాట్లాడుతున్నారనీ.. ఇది తనను తీవ్రంగా బాధించిందని చెప్పాడు. విషయం కోర్ట్ పరిధిలో ఉన్నందున, తను బెయిల్ పై ఉన్నాడు కాబట్టి.. ఎక్కువగా రియాక్ట్ కాలేకపోతున్నానని.. ఆయన ఎమోషనల్ గా చెప్పినా పోలీస్ లు సీరియస్ గా తీసుకున్నారు. అల్లు అర్జున్ ప్రెస్ మీట్ కు కౌంటర్ గా మరో ప్రెస్ మీట్ పెట్టి అన్ని ఆధారాలతో మీడియాకు వివరించే ప్రయత్నం చేశారు.

ఇక బెయిల్ పై ఉండగా ప్రెస్ మీట్ పెట్టి పోలీస్ ల ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా మాట్లాడాడు అని మరోసారి పోలీస్ విచారణకు పిలిపించారు. చిక్కడ పల్లి స్టేషన్ లో ఏసిపీ, సిఐలు.. అల్లు అర్జున్ ను అతని లాయర్ సమక్షంలో విచారించారు. ఇందుకోసం 16కు పైగా ప్రశ్నలు ఉన్న నోట్ ను ముందే అందించారు. వాటన్నిటికీ సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారట. కొన్ని ప్రశ్నలకు ఐకన్ స్టార్ తడబడ్డా.. కాస్త బలంగానే తన వాదన వినిపించాడట. మొత్తంగా అక్కడి నుంచి సంధ్య థియేటర్ లో ‘సీన్ రీ క్రియేట్’చేస్తారు అని వినిపించినా.. అది తర్వాత చూద్దాం అని పోలీస్ లుచెప్పడంతో విచారణ ముగించుకుని ఇంటికి చేరాడు అల్లు అర్జున్.

Tags

Next Story