Allu Arjun : గద్దర్ అవార్డ్స్ పై అల్లు అర్జున్ రియాక్షన్

Allu Arjun :  గద్దర్ అవార్డ్స్ పై అల్లు అర్జున్ రియాక్షన్
X

తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డ్స్ లో అల్లు అర్జున్ ను పుష్ప 2 చిత్రానికి ఉత్తమ నటుడుగా గుర్తించింది. పుష్ప 2 థియేటర్ తొక్కిసలాట తర్వాత జరిగిన గలాటా అంతా ఇంతా కాదు. అల్లు అర్జున్ ఏకంగా ఒక రాత్రి జైలులోనే గడపాల్సి వచ్చింది. ఓ దశలో రేవంత్ వర్సెస్ అల్లు అర్జున్ అన్నట్టుగా సాగింది ఆ తతంగం అంతా. దీంతో రేవంత్ ప్రభుత్వం అల్లు అర్జున్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసింది అని చాలామంది విమర్శలు చేశారు. అలాంటి విమర్శలన్నిటికీ ఈ అవార్డ్ తో ఫుల్ స్టాప్ పెట్టింది ప్రభుత్వం. అల్లు అర్జున్ ను బెస్ట్ యాక్టర్ గా సత్కరించబోతోంది.

ఇక తనను ఉత్తమ నటుడుగా ఎంపిక చేయడం పట్ల ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పాడు అల్లు అర్జున్. ఈ అవార్డ్ ను ఓ గౌరవంగా భావిస్తా అన్నాడు. క్రెడిట్ మొత్తాన్ని దర్శక నిర్మాతలకే ఇచ్చాడు. అభిమానుల ప్రేమ తనను ఎప్పుడూ ఉత్సాహపరుస్తుందని.. అందుకే ఈ అవార్డ్ ను ఫ్యాన్స్ కే అంకితం చేస్తున్నా అని తెలిపాడు. మొత్తంగా అల్లు అర్జున్ కూడా ఇకపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బందులూ ఫేస్ చేయకుండా తన పనిలో తను ఉండబోతున్నా అని చెప్పినట్టైంది ఈ రియాక్షన్ తో.

Tags

Next Story