Allu Arjun : అల్లు అర్జున్ తన స్టాఫ్ ను మార్చేస్తున్నాడా

స్టార్ హీరోలు అనగానే వారి చుట్టూ చాలామంది జనం కనిపిస్తుంటారు. అయితే వారికంటూ కొందరు పర్సనల్ స్టాఫ్ కూడా ఉంటారు. వీరిలో కొందరు వంది మాగధుల్లా కనిపిస్తుంటారు. అయిన దానికీ కాని దానికీ భజన చేయడమే వారి పని. ఇంకొందరైతే సినిమాల ఫలితాలతో పాటు ఇతర విమర్శల గురించి ఆ హీరోల వరకూ వెళ్లకుండా అడ్డుకుంటారు. అంటే సదరు హీరో సినిమా ఫ్లాప్ అయినా.. వీళ్లు బ్లాక్ బస్టర్ అనే భ్రమల్లో అతన్ని ఉంచుతారు. ఎవరైనా నిజం చెప్పినా.. అలా చెప్పిన వాళ్లు వెధవలు అన్న ఇమేజ్ ఆ హీరో ముందు క్రియేట్ చేస్తుంటారు. టాలీవుడ్ లో ఇలాంటి టీమ్స్ చాలానే ఉన్నాయంటారు. అయితే కొందరు మాత్రం కాస్త ఎక్కువ అతి చేస్తుంటారు. అలాంటి హీరోల టీమ్ అంటే అల్లు అర్జున్ దే అనేది టాలీవుడ్ లో చాలామంది చెప్పుకునే మాట.
ఆయన మామూలుగానే ఉన్నా.. తన టీమ్ చేసే అతి వల్ల ఎక్కువసార్లు విమర్శలు వస్తున్నాయి. రీసెంట్ గా సంధ్య థియేటర్ ఘటన సమయంలో కూడా ఆయన టీమ్ చేసిన అతి ఎక్కువ అయిందనే కామెంట్స్ చాలా వినిపించాయి. బౌన్సర్స్ ఎలాగూ ఇతర మనుషుల్ని పురుగుల్లా చూస్తారు. వారిని ఇంకా రెచ్చగొట్టి జనాలను అడ్డగోలుగా తోయించారు అల్లు అర్జున్ టీమ్ లోని కొందరు అనేది అతని వరకూ వెళ్లిందట. అందుకే ఆ సంఘటనలోనే కాదు.. ఇతర సందర్భాల్లో అనవసరంగా కమెంట్స్ చేస్తూ.. తన ముందు, వెనక తన కోసం అతి చేస్తోన్న వారిని గుర్తించాడట. ప్రస్తుతం వారిని తన టీమ్ నుంచి తొలగించబోతున్నాడు అంటున్నారు.
నిజంగా ఇది మంచి విషయమే. హీరోలైనా ఇంకెవరైనా జరుగుతున్న విషయాలను స్వయంగా తెలుసుకుంటేనే మంచిది. లేదంటే ఇలాంటి వందిమాగధులు( భజన, ఓవరాక్షన్ బ్యాచ్ ను ఇలా అంటారు) చుట్టూ చేరి ఇమేజ్ లకే హోల్స్ పెట్టేస్తుంటారు. ఐకన్ స్టార్ తో ఇతర హీరోలు కూడా తమ టీమ్స్ ను ఓసారి ప్రక్షాళన చేసుకుంటే ఇంకా మంచిది. ముందు చూపులా ఉంటుంది కాబట్టి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com