తెలుగులో హీరోయిన్‎గా అల్లు అర్జున్ 'చెల్లెలు'..పక్కా ప్లాన్‎తోనే ఎంట్రీ..ఇప్పటికే..

Vishnavi Chaitanya has Signed Three More Films

Vishnavi Chaitanya

Tollywood:రాజ్ తరుణ్, నవీన్ పొలిశెట్టి లాంటి యువ హీరోలు కూడా సోషల్ మీడియా ద్వారా స్టార్స్ అయిన వారే. టాలీవుడ్ కమెడియన్ సుదర్శన్, బిగ్ బాస్ ఫేం హారిక ..

Tollywood: సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఎందరో సామాన్యులను స్టార్స్ ని చేసింది. అంతేకాదు సినిమాల్లో ఛాన్స్ లు వచ్చేలా చేస్తుంది. రాజ్ తరుణ్, నవీన్ పొలిశెట్టి లాంటి యువ హీరోలు కూడా సోషల్ మీడియా ద్వారా స్టార్స్ అయిన వారే. టాలీవుడ్ కమెడియన్ సుదర్శన్, బిగ్ బాస్ ఫేం హారిక కూడా షార్ట్ ఫిల్మింస్ ద్వారానే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఇప్పుడు తాజాగా మరో నటి నెటింట్లో పాపులర్ అయ్యింది. ఆమె ఎవరో కాదు వైష్ణవి చైతన్య.. సోషల్ మీడియాలో వైష్ణవి చైతన్య పరిచయం అక్కర్లేని పేరు. ఈ అమ్మడు యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మింస్, వెబ్ సిరీస్ లతో వీపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది.

ఇటీవలే ఈ ముద్దుగుమ్మ నటించిన The Software DevLOVEper(సాఫ్ట్‎వేర్ డెవ'లవ్‎'పర్) అనే వెబ్ సిరీస్ సోషల్ మీడియాలో ట్రైండ్ అయింది. ఈ సిరీస్‎లో వైష్ణవి నటనకు మంచి మార్కులు పడ్డాయి. వైష్ణవి నటనకు నెటిజన్లు ఫిదా అయ్యారు. అంతేకాదు ఈమెపై టాలీవుడ్ నిర్మాతల దృష్టి పడింది. ఇప్పటికే కొంత మంది చిన్న సినిమాల నిర్మాతలు హీరోయిన్ గా నటించాలని వైష్ణవిని సంప్రదించినట్లు సమాచారం.

గతంలో వైష్ణవి 2017లో వచ్చిన క్షణం ఒక యుగమే అనే షార్ట్ ఫిల్మిం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మాస్ మహారాజ్ రవితేజ మూవీ టచ్ చేసి చూడు సినిమాతోపాటు, అల్లుఅర్జున్ ఇండ్రస్ట్రీ హిట్ మూవీ అల వైకుంఠపురంలో.. సినిమాలో కూడా నటించింది వైష్ణవి.


Vishnavi Chaitanya

ఈ అమ్మడికి టాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చిందని తెలుస్తోంది. పలువురు స్టార్ హీరోలతో నటించే అవకాశం వచ్చిందని టాలీవుడ్ వర్గాల బొగట్టా. ఇక ఇప్పటికే ఈ భామ హీరోయిన్ గా విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ చిత్రంలో హీరోయిన్ గా స్క్రీన్ షేర్ చేసుకోబొతుందని ఫిల్మీనగర్ వర్గాల్లో టాక్. మరో రెండు సినిమాలకు ఒప్పకున్నట్లు సమాచారం. మొత్తానికి అన్ని అనుకున్నట్లు జరిగితే.. వైష్ణవి నటించే మూడు సినిమాలు సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. అలా జరిగితే వైష్ణవి టాలీవుడ్ లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పనిలేదు. చూద్దాం ఈ అమ్మడి ఫేట్ ఎలా మారబోతుందో.

Tags

Read MoreRead Less
Next Story