Allu Arjun: ఆ యాడ్‌లో నటిస్తే రూ.10 కోట్లు.. ఆఫర్ రిజెక్ట్ చేసిన బన్నీ..

Allu Arjun: టాలీవుడ్ స్టైలిష్ హీరో ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు అల్లు అర్జున్.. ఆయన ధరించే దుస్తులు, వేసుకునే షూ, పెట్టుకునే గాగుల్స్ అన్నీ లేటెస్ట్ ఫ్యాషన్‌కి స్వాగతం పలుకుతున్నట్లు ఉంటాయి.
పుష్ప సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బన్నీ పుష్ప2కి వచ్చిన గ్యాప్‌ని క్యాష్ చేసుకుంటున్నాడు.. భారీ స్థాయిలో రూపొందిద్దుకుంటున్న ప్రకటనలకు వర్క్ చేస్తున్నాడు.. సినిమా సెట్టింగ్స్‌ని, సీన్స్‌ని తలపించేలా యాడ్స్ డిజైన చేస్తున్నారు ప్రకటన కర్తలు. బన్నీ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని భారీ స్థాయిలో రెమ్యునరేషన్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయి ఆయా ప్రకటన సంస్థలు.
ఇప్పటికే బన్నీ శీతలపానీయ ఉత్పత్తుల సంస్థ, బస్సు, స్కూటర్ ప్రయాణాలకు సంబంధించిన యాప్స్, ఫుడ్ డెలివరీ యాప్ వంటి వాటికి బన్నీ బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్నారు. యాడ్స్ కోసం కొన్ని గంటలు పని చేస్తే సరిపోతుంది.. సినిమాల్లో లాగా రోజుల తరబడి పనిచేయాల్సిన అవసరం ఉండదు.. అయినా భారీ పారితోషికం అందుకోవచ్చు.
కొన్ని బ్రాండ్ల యాడ్స్ కోసం దాదాపు రూ.7.5 కోట్ల పారితోషికం అందుకున్నారు అల్లు అర్జున్. ఈ క్రమంలో బన్నీకి పొగాకు ఉత్పత్తులకు సంబంధించిన ఒక సంస్థ నుంచి భారీ ఆఫర్ వచ్చిందట. తమ ప్రకటనకు సంబంధించిన షూట్ కోసం రోజులో కొన్ని గంటలు కెమెరా ముందుకు వస్తే సుమారు రూ.10కోట్లు ఇస్తామని అన్నారట.
కానీ బన్నీ ఏ మాత్రం ఆలోచించకుండా ఆ ఆఫర్‌ని రిజెక్ట్ చేశారు. ఇలాంటి ప్రకటనలు చేస్తే అభిమానులు తనని తప్పుగా అర్థం చేసుకుంటారు.. తనను చూసి వాళ్లు కూడా పొగాకు ఉత్పత్తులకు అలవాటు పడతారని, అందుకే ఆ యాడ్‌కు ఎంత పారితోషికం ఇచ్చినా చేయనని అన్నారట. ఆ విషయం తెలిసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com