Pushpa 50 Days : పుష్ప.. 50 రోజులు,365 కోట్లు.. తగ్గేదేలే.. !

Pushpa 50 Days : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం పుష్ప.. పాన్ ఇండియా మూవీగా వచ్చిన ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించగా, మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. భారీ అంచనాల మధ్య గతేడాది డిసెంబర్ 17న వరల్డ్ వైడ్‌గా రిలీజైన పుష్ప ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
అల్లు అర్జున్ నటన, సుకుమార్ టేకింగ్, అదిరిపోయే పాటలు, డైలాగ్ లకి అంతా ఫిదా అయిపోయారు. ఈ సినిమా నేటితో 50 రోజులు కంప్లీట్ చేసుకుంది. ఈ మేరకు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇటీవల కాలంలో థియేటర్స్‌లో అఖండ చిత్రం తర్వాత 50 రోజులు పూర్తి చేసుకున్న సినిమా పుష్ప మాత్రమే కావడం విశేషం. ఇప్పటివరకు ఈ చిత్రం ప్రపంవ్యాప్తంగా 365 కోట్లు గ్రాస్ వసూళ్ళు సాధించినట్టుగా మేకర్స్ వెల్లడించారు.
ఇక సినిమా రిలీజ్ అయిన కొన్ని రోజులకే ఓటీటీలో రిలీజ్ అయినప్పటికీ థియేటర్స్‌లో మాత్రం సందడి తగ్గలేదు. ముఖ్యంగా బాలీవుడ్‌లో అయితే ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. కేవలం ఈ చిత్రం హిందీలోనే వంద కోట్లు కొల్లగొట్టింది. కాగా ఈ సినిమాకి సీక్వెల్‌గా పార్ట్ 2 రానుంది. షూటింగ్ త్వరలోనే మొదలుపెట్టనున్నారు.
50 Days for the AAll India MASSive Blockbuster #PushpaTheRise 💥💥
— Pushpa (@PushpaMovie) February 4, 2022
With huge 365cr Gross Worldwide 🔥🔥#50DaysForBlockbusterPushpa 🔥@alluarjun @iamRashmika @aryasukku @ThisIsDSP @adityamusic @TSeries @MythriOfficial pic.twitter.com/iVlGPArQw9
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com