Allu Arjun: 'సామజవరగమన' సూపర్ అంటున్న అల్లూ అర్జున్

పుష్పాతో ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు అల్లూ అర్జున్. దీంతో ఆయన డిమాండ్ అంతకంతకూ పెరిగిపోయింది. ఆయన చేసే ఏ ప్రమోషన్ అయినా సదరు సినిమాకు మైలేజ్ ను ఇస్తుంది. తాజాగా శ్రీ విష్ణు హీరోగా నటించిన సామజవరగమన సినిమాకు అభినందనలు తెలిపాడు అర్జున్. సినిమా చాలా బాగుందని ట్వీట్ చేశాడు. తెలుగులో చాలా కాలంగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా రాలేదని ఆలోటును సామజవరగమన తీర్చిందని చెప్పుకొచ్చాడు.
ఈ సినిమా దర్శకుడు రామ్ అబ్బరాజు అద్భుతంగా తెరకెక్కించినట్లు అల్లూ అర్జున్ కొనయాడారు. సినిమాలో శ్రీవిష్ణు అలవోకగా నటించేసాడని అన్నాడు. అల్లరి నరేష్, వెన్నెల కిషోర్ సినిమాకు పిల్లర్స్ గా నిల్చున్నారని చెప్పాడు. రేబ మోనిక టెక్నీషియన్లు, నిర్మాత కలిసి మంచి సినిమాను ప్రేక్షకులకు అందించారని అర్జున్ కొనియాడారు.
అల్లూ అర్జున్ నటిస్తోన్న పుష్ప 2 సినిమా షూటింగ్ పనులను శరవేగంగా పూర్తిచేసుకుంటోంది. ఈ సినిమాను డిసెంబర్ 22 న రిలీజ్ చేయనున్నట్లు దర్శకుడు సుకుమార్ తెలిపారు. పుష్ప 2 లో ఫాహద్ కు అల్లూ అర్జున్ కు మధ్య ఉండే సీన్లు ప్రేక్షకులను అలరిస్తాయని చిత్ర యునిట్ తెలిపింది. ఇప్పటికే పుష్ప మూవీ దేశవ్యాప్తంగా భారీ విజయాన్ని నమోదు చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com