Allu Arjun : పక్కా ఆ రెండు సినిమాలు ఫ్లాప్ అవుతాయని తెలిసి కూడా చేసిన బన్నీ..!

Allu Arjun : ఓ సినిమా ఒప్పుకోవాలంటే కథ, కథనం నచ్చాలి. తమ ఇమేజ్‌కి ఏమాత్రం డ్యామేజ్ పడకుండా చూసుకోవడానికి శత విధాల ప్రయత్నిస్తారు. అన్నీ కుదిరితే ప్రేక్షకులు ఆదరిస్తారు. లేదంటే ఎంత పెద్ద స్టార్ హీరో అయినా రిజెక్ట్ చేస్తారు. అందుకే కధల విషయంలో ఆచి తూచి అడుగేస్తుంటారు హీరో హీరోయిన్లు ఎవరైనా.
అయితే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున మాత్రం తనకు ఆ చిత్రాలు ఫ్లాప్ అవుతాయని ముందే తెలిసినా నటించాడట. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన అల్లు అర్జున్ స్థాయిని మరింత పెంచింది. దాంతో ఆర్య 2తో మళ్లీ బాక్సాఫీస్ హిట్ కొట్టాలనుకున్న నిర్మాతకు నిరాశే ఎదురయ్యింది.
అయితే ఆ సినిమా చేస్తున్నప్పుడే అల్లు అర్జున్‌కి అనిపించిందట. ఇది ఆర్య సినిమా స్థాయిని చేరుకోదని. అలాగే మరో సినిమా వేదం.. ఈ చిత్రం చేయడానికి ఒప్పుకున్నప్పుడు ఇది గమ్యం స్థాయిని చేరుకోలేదని అనుకున్నాడట.
అయినా ఆ సినిమాలో చేయడానికి కారణం భవిష్యత్తులో వెనక్కి తిరిగి చూసుకుంటే తనవంటూ కొన్ని విభిన్న తరహా చిత్రాలు కనిపించాలి అని అనుకున్నాడట. అందుకే ఆ చిత్రాల్లో చేశాను అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు అల్లు అర్జున్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com