ALLU ARJUN: అల్లు అర్జున్ ను చూసి ఏడ్చేసిన స్నేహ

జైలు నుంచి విడుదలపై ఇంటికి వచ్చిన అల్లు అర్జున్ ను చూసి భార్య స్నేహా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అల్లు అర్జున్ కౌగిలించుకుని కంటతడి పెట్టుకున్నారు. స్నేహాకు అల్లు అర్జున్ ధైర్యం చెప్పారు. అల్లు అర్జున్ కుమారుడు అయాన్ పరిగెత్తుతూ వచ్చి తండ్రిని హగ్ చేసుకున్నాడు. అర్హ కూడా తండ్రిని చూసి మురిసిపోయింది. దీంతో అక్కడ భావోద్వేగ వాతావరణం కనిపించింది.
నాన్న వచ్చేశాడోచ్.. అల్లు అయాన్ సంబరం
చంచల్ గూడ జైలు నుంచి విడుదలై ఇంటికి వచ్చిన తండ్రి అల్లు అర్జున్ ను చూసి అల్లు అయాన్ ఎగిరి గంతేశాడు. నాన్న వచ్చాడోచ్.. అంటూ ఎగిరి గంతేసి అల్లు అర్జున్ దగ్గరికి వచ్చి హగ్ చేసుకున్నాడు. అల్లు అర్జున్ కూడా కుమారుడిని చూసి భావోద్వేగానికి గురయ్యాడు. అనంతరం అల్లు అర్హ కూడా తండ్రిని చూసి సంబరపడింది. దీంతో అక్కడ భావోద్వేగ వాతావరణం నెలకొంది.
తెల్లవారుజామున విడుదల
హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలు నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విడుదలయ్యారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఉత్తర్వులను పరిశీలించిన జైలు అధికారులు తెల్లవారుజామున ఆయన్ను జైలు వెనుక గేటు నుంచి విడుదల చేశారు. సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట కేసులో శుక్రవారం మధ్యాహ్నం చిక్కడపల్లి పోలీసులు బన్నీని అరెస్ట్ చేశారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా.. 14 రోజుల రిమాండ్ విధించింది. అరెస్టుపై అల్లు అర్జున్ లాయర్లు హైకోర్టును ఆశ్రయించగా మధ్యంతర బెయిల్ లభించింది. అయితే, శుక్రవారం రాత్రే బన్నీ విడుదల కావాల్సి ఉండగా.. బెయిల్ పత్రాలు అందే విషయంలో జాప్యం జరిగింది. దీంతో రాత్రి అంతా బన్నీ జైలులోనే ఉండాల్సి వచ్చింది. ప్రస్తుతం చంచల్‌గూడ జైలు నుంచి ఆయన ఇంటికి బయలుదేరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com