Allu Arjun : అల్లు అర్జున్ బెయిల్ రద్దు .. 14 రోజులు జైలుకు

ఈ నెల 4న సంధ్య థియేటర్ జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కేస్ లో అల్లు అర్జున్ కు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది కోర్ట్. నిజానికి ఇది ఎవరూ ఊహించలేదు అనుకుంటున్నారు కానీ.. అర్జున్ పై నమోదైన కేస్ లలో బిఎన్ఎస్ 105 నాన్ బెయిలబుల్ సెక్షన్. అందువల్ల ముందు నుంచీ న్యాయ నిపుణులంతా అతనికి రిమాండ్ విధిస్తారు అనే భావిస్తున్నారు. భావించినట్టుగానే అల్లు అర్జున్ కు 14రోజుల రిమాండ్ విధించడం అనేది ఆ కుటుంబానికి షాకింగ్ అనే చెప్పాలి.
అయితే ఇదే కేస్ పై అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయొద్దంటూ అతని న్యాయవాదులు హై కోర్ట్ స్క్వాష్ పిటిషన్ వేశారు. హై కోర్ట్ నుంచి వచ్చే తీర్పును బట్టి అర్జున్ ను రిమాండ్ కు తరలిస్తారా లేదా అనేది తెలుస్తుంది. అయితే హై కోర్ట్ లో పోలీస్ లు, అర్జున్ తరఫు న్యాయవాదుల మధ్య సాగే వాదోపవాదాలను బట్టి తీర్పు వచ్చే అవకాశం ఉంది. బట్ హై కోర్ట్ లో బలమైన వాదన వినిపించడంలో అల్లు అర్జున్ లాయర్లు విఫలమయ్యారు. దీంతో హై కోర్ట్ లో కూడా అతని బెయిల్ పిటిషన్ రద్దయింది. ఈ కేస్ ను గురువారానికి వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది హై కోర్ట్.
ఇక అర్జున్ 14 రోజుల పాటు జైల్లోనే ఉండాల్సి ఉంటుంది. ఈ తీర్పును పోలీస్ లు ముందే ఊహించినట్టుగా ఉన్నారు. అందుకే హైదరాబాద్ లో పలు చోట్ల ట్రాఫిక్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అటు అల్లు అర్జున్ ను తరలించబోయే చంచల్ గూడ జైలు పరిసర ప్రాంతాల్లో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. మరి హై కోర్ట్ నుంచి వచ్చే తీర్పులో బెయిల్ వస్తే జైలుకు వెళ్లడం ఉండదు. లేదంటే పుష్పరాజ్ జైలుకు వెళ్లక తప్పని పరిస్థితి ఉంది.
ఒక రకంగా కోర్ట్ తీర్పుపై అభిమానులతో పాటు, ఇండస్ట్రీ నుంచి అసంతృప్తి కనిపిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com