Devara: తారక్ సినిమాలో అల్లూ అర్హ..!

Devara: తారక్ సినిమాలో అల్లూ అర్హ..!
లొకేషన్ మొత్తం అర్హ సందడి చేస్తున్నట్లు తెలుస్తోంది. తారక్ నటిస్తున్న దేవర సినిమా తనకు రెండవది

నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా దేవర. ఈ సినిమాలో అల్లూ అర్జున్ తనయ అల్లు అర్హ అతిథి పాత్రలో నటించినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెవులుకొరుక్కుంటున్నాయి. లొకేషన్ మొత్తం అర్హ సందడి చేస్తున్నట్లు తెలుస్తోంది. తారక్ నటిస్తున్న దేవర సినిమా తనకు రెండవది. ఈ చిత్రంలో జూనియర్ సరసన జాన్వీ కపూర్ నిటిస్తోంది. జాన్వీకి తెలుగులో ఇది మొదటి సినిమా. దీంతో ఇండస్ట్రీలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. అల్లూ అర్హ మొదటి సినిమా శాకుంతలం. ఈ సినిమాతో అర్హకు కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.




జాన్వీ చిన్ననాటి పాత్రను అర్హ చేయనున్నట్లు తెలుస్తోంది. తెలుగు అనర్గలంగా మాట్లాడే అర్హ చిత్ర సీమలో పెద్లను కూడా తన తెలుగుతో కట్టిపడేస్తున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ స్నేహ రెడ్డి దంపతులకు అర్హ రెండవ సంతానం. శాకుంతలంలో సమంతతో కలిసి నటించింది. యువ భరతుడిగా ముని ఆశ్రమవాసిగా కనిపించింది. అర్హ నటనకు సమంత సైతం అభినందనలు తెలిపింది. దేవర సెట్ లో అర్హ కోసం తారక్ ప్రత్యేక శ్రద్ధవహిస్తున్నాడు. సొంత కూతురిలా చూసుకుంటున్నాడని యునిట్ సభ్యలు అనుకుంటున్నారు. ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ ప్రాంతంలో ఈ సినిమా సాగనున్నట్లు తెలుస్తోంది.





2024లో దేవరను రిలీజ్ చేయడానికి చిత్ర దర్శకులు కొరటాల శివ అన్ని చర్యలను తీసుకుంటున్నారు. తారక్, కొరటాల కలిసి జనతా గ్యారేజ్ లాంటి హిట్ ను అభిమానులకు అందించిన సంగతి తెలిసిందే. దువరలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా చేస్తున్నాడు. సినిమా పోస్టర్ ను ఇదివరకే రిలీజ్ చేశారు. ఇందులో ఎన్టీఆర్ సముద్రం ఒడ్డున ఆయుధం పట్టుకుని కనిపిస్తాడు.


Tags

Read MoreRead Less
Next Story